ఉపాసన కంటే నాకు ఆమెనే ఇష్టం.. రామ్ చరణ్ మనసు దోచిన డ్రీమ్ గర్ల్.!

Pandrala Sravanthi
రామ్ చరణ్ ఉపాసన ఇద్దరిది ప్రేమ వివాహం.. కానీ రామ్ చరణ్ కి మాత్రం ఉపాసన కంటే ఆమెనే ఇష్టమట. మరి భార్య కంటే రామ్ చరణ్ అంతలా ఇష్టపడిన ఆ అమ్మాయి ఎవరు.. అంత ఇష్టపడి పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనుకుంటారు ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్స్. ఇక ఇంకొంతమంది ఏమో చిరంజీవి లాంటి దిగ్గజ హీరో కొడుకు కాబట్టి ఆయన ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం కూడా లేదా అని అనుకుంటారు. అయితే రామ్ చరణ్ ఇష్టపడింది ఎవరినో తెలిస్తే మీరందరూ ఈ మాటలు మాట్లాడరు. ఎందుకంటే రాంచరణ్ మనసు దోచిన ఆయన ఫస్ట్ క్రష్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..


 2023లో రామ్ చరణ్ ఓ మీడియా సంస్థ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా మీ మనసు దోచిన మీ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్ ఎవరు అంటూ రాం చరణ్ కి ప్రశ్న ఎదురవగా ఆయన కాస్త సిగ్గు పడుతూ హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్ పేరు చెప్పారు.. ప్రెట్టీ ఉమెన్ సినిమా చూసినప్పటి నుండి ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయానని, స్క్రీన్ మీద జూలియా రాబర్ట్ కనిపిస్తే నా కళ్ళు పక్క కు తిప్పుకోలేను అంటూ నవ్వుకుంటూ చెప్పారు.

అలాగే మరో హాలీవుడ్ నటి కేథరిన్ జిటా జోన్స్ అన్నా కూడా నాకు ఇష్టం అంటూ తన సెలబ్రిటీ క్రష్ ఎవరో చెప్పుకొచ్చారు.ఇక ఈ విషయం తెలిసిన చాలామంది నెటిజన్స్ రామ్ చరణ్ తెలుగు హీరో అయి ఉండి హాలీవుడ్ హీరోయిన్లను ఇష్టపడడం ఏంటో అర్థం అవడం లేదు.. మన ఇండియన్ సినిమాల్లో ఆ హీరోయిన్లను మించిన అందగత్తెలే లేరా  అంటూ నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు.కానీ మరి కొంత మందేమో ఎవరి అభిప్రాయం వారిది అంటూ రామ్ చరణ్ కి సపోర్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: