నాగార్జున 100 ముందు ఉన్న సవాళ్లు ఇవే.. ఈ సవాళ్ళను నాగ్ అధిగమిస్తారా?

Reddy P Rajasekhar
స్టార్ హీరో నాగార్జున 100వ సినిమా గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ప్రముఖ దర్శకుడు ఆర్ కార్తీక్ డైరెక్షన్‌లో ఈ సినిమా ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటుంది.

చరిత్రను పరిశీలిస్తే, టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామందికి వారి 100వ సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. ఈ నేపథ్యంలో, నాగార్జున తన 100వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సాధిస్తారోనని సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రం 2026లో థియేటర్లలో విడుదల కానుంది. ఇది నాగార్జున కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయి కానుంది. నాగ్  ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.

ఈ మధ్య కాలంలో నాగార్జున వరుసగా సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సపోర్టింగ్ రోల్స్ చేయడం వల్ల నాగార్జునకు భారీ పారితోషికం లభించడంతో పాటు ఊహించని స్థాయిలో విజయాలు దక్కుతుండటం గమనార్హం.   అయితే నాగార్జున వరుసగా  సపోర్టింగ్ రోల్స్ లో నటించడం విషయంలో సైతం అభిమానుల  నుంచి తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతూ  ఉండటం గమనార్హం,

నాగార్జున భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.  నాగ్ ను   ఫ్యాన్స్  అంతకంతకూ  పెరుగుతోంది.  నాగార్జున పారితోషికం ప్రస్తుతం 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. నాగ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే  ఈ హీరో ఖాతాలో మరిన్ని రికార్డులు చేరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: