రాజమౌళి సీక్వెల్ చేయాలని అనుకుంటే ఏ సినిమా ఎంచుకుంటారు తెలుసా..? రొమాలు నిక్కబొడుచుకుని డ్యాన్స్ చేసే మూవీ..!
అయితే, ఇంతటి గొప్ప సినిమాలు తీసిన రాజమౌళి, ఒకవేళ ఆయన తెరకెక్కించిన మూవీల్లో సీక్వెల్ చేయాలని అనుకుంటే ఏ సినిమా ఎంచుకుంటారు? అనే ప్రశ్న అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి కలిగిస్తూనే ఉంటుంది. సాధారణంగా రాజమౌళి సీక్వెల్స్ చేయడాన్ని పెద్దగా ఇష్టపడరు. ఒక కథను ఒకదానితోనే ముగించి, కొత్త కాన్సెప్టుతో ముందుకు వెళ్ళడం ఆయన స్టైల్. కానీ గతంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చాలా ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. “సాధారణంగా నేను సీక్వెల్స్ చేయాలని అనుకునేవాడిని కాదు. కానీ ఒక సినిమా అయితే మాత్రం నాకు అవకాశం దొరికితే దానికి సీక్వెల్ తీయాలనిపిస్తుంది. అది విక్రమార్కుడు” అని ఆయన ఓపెన్‌గా చెప్పారు.
2006లో విడుదలైన విక్రమార్కుడు సినిమా అప్పట్లో ఎంతటి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రవితేజ ఎనర్జిటిక్ నటన, అనుష్క గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్, ఎమ్.ఎం.కీరవాణి అందించిన మ్యూజిక్, రవితేజ డ్యుయల్ షేడ్స్, అలాగే రాజమౌళి మాస్ ట్రీట్మెంట్ అన్ని కలిసి ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయ్యింది. టీవీలో ఎన్ని సార్లు వచ్చినా ప్రేక్షకులు కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉంటారు. అందుకే రాజమౌళి “సీక్వెల్ చేస్తే తప్పకుండా విక్రమార్కుడు 2 తీయాలని ఉంది” అని చెప్పడం అభిమానుల్లో కొత్త ఎక్సైట్మెంట్‌ను క్రియేట్ చేసింది. ఎందుకంటే ఆ సినిమా తర్వాత మాస్ యాక్షన్ సినిమాలకు ఒక కొత్త డెఫినిషన్ వచ్చేసింది. ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తే అది ఖచ్చితంగా మరో లెవెల్ బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.