సడెన్ ప్లాన్ చేంజ్.. అనసూయ ప్లేస్‌లోకి లయ.. రాత్రికి రాత్రే ఏం జరిగింది..?
ఇండస్ట్రీలో అందచందాలను ఎక్స్పోజ్ చేస్తూ ఆఫర్స్ దక్కించుకున్న సమయంలో కూడా, చాలా ట్రెడిషనల్ పాత్రల్లో నటిస్తూ మెప్పించింది. రీసెంట్ గానే తన రెండో ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. తమ్ముడు సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి, అయితే సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. ఆ తర్వాత లయకు పెద్దగా అవకాశాలు రాలేదు అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఆమెకు జాక్‌పాట్ ఛాన్స్ దక్కినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమా రంగస్థలం 2గా వస్తుందనే న్యూస్ బయటకు వచ్చింది. రంగస్థలం సినిమాలో అనసూయ నటించిన "రంగమ్మ అత్త" పాత్ర ఎంత హైలైట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
ఆ పాత్రలో నటించడానికి గట్స్ ఉండాలి. ఈసారి ఆ పాత్రను అనసూయ కాకుండా లయకు ఇవ్వాలని సుకుమార్ ఫిక్స్ అయినట్లు టాక్. మొదట అనసూయనే అనుకున్నా, సడెన్‌గా ప్లాన్ మార్చి, కొందరు పెద్దల సూచనతో లయను తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. సినీ ప్రముఖుల ప్రకారం..ఇంత పాపులర్ అయిన పాత్రను లయకు ఇస్తున్న సుకుమార్ డెసిషన్ బిగ్ రిస్క్ అని అంటున్నారు. మరి సుకుమార్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూడాలి..?!?