రాజమౌళి తలరాతనే మార్చేసిన ఆ ఒక్క మాట.. అంతా దేవుడి మాయ..!

Thota Jaya Madhuri
రాజమౌళి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ బిగ్ పాన్ ఇండియా డైరెక్టర్. ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లు ఉన్నా, రాజమౌళిలా సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ మరొకరు లేరని అభిమానులు తరచూ చెబుతుంటారు. అంతకుముందు కూడా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు తెరకెక్కించిన సినిమాలను హిట్‌ చేశారు. కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన వారు ఎవరూ లేరు. ఆ ఘనతను బాహుబలి సినిమాతో రాజమౌళి సాధించారు. అయితే రాజమౌళి తలరాతనే మార్చేసిన ఒక మాట గురించి అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఆయన సినిమా ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలిసిందే.


 
ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన మొదటి చిత్రం స్టూడెంట్ నెంబర్ వన్. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించారు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ ఎంత బొద్దుగా ఉండేవారో అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తిని హీరోగా తీసుకొని, కొత్త డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడా..? అంటూ చాలామంది వెటకారంగా, వ్యంగ్యంగా మాట్లాడుకున్నారు. సినిమా షూటింగ్ టైంలో కూడా ఎన్నో నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. కానీ ఆ నెగిటివిటీని మొత్తం పాజిటివిటీగా మార్చుకున్నాడు రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ చూసిన ప్రతి ఒక్కరు “ఈ డైరెక్టర్ సినిమాలను బాగా తెరకెక్కించాడు” అని ప్రశంసించారు. అంతేకాదు, అప్పట్లో ఇండస్ట్రీలో ఇప్పటికే బాగా స్థిరపడ్డ స్టార్ డైరెక్టర్లు ఉన్నా, వారినీ ఒకే ఒక్క సినిమాతో భయపెట్టేశాడు. చాలా మంది అప్పటినుంచే “రాజమౌళి ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అవుతాడు” అని మాట్లాడుకున్నారు.



అయితే రాజమౌళి సినిమాల కోసం ప్రయత్నాలు చేస్తూ చేస్తూ ఆఫర్లు రాకపోతే ఏదైనా జాబ్ చేసి జీవనం కొనసాగించాలి అనుకునేవారట. అప్పటివరకు రాజమౌళికి స్వంతంగా ఎలాంటి సంపాదన లేదు. ఆయన రమా రాజమౌళి జీతంతోనే జీవించారని ఇంటర్వ్యూలో చెప్పారు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా రిలీజ్ అయిన తర్వాత, “రాజమౌళి ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అవుతాడు” అని ప్రతి ఒక్కరూ చెప్పడం ఆయనకు కొత్త బూస్టర్ ఇచ్చింది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా రాజమౌళి తలరాతనే మార్చేసింది. ఇది అంతా దేవుడి మాయే. అసలు ఇండస్ట్రీలో రాజమౌళి ఇలా సెట్ అవుతారని ఎవరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే రాజమౌళి, రాజమౌళి లేకపోతే టాలీవుడ్ లేదు అనుకునే స్థాయికి వెళ్లిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: