అలాంటి వాళ్ల నోర్లు మూయించేలా అట్లీ డబుల్ స్పైసీ హాట్ ప్లాన్.. బన్నీ ఇంప్రెస్..!
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారని సమాచారం. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా పూర్తయిందట. రీసెంట్‌గా విజయ్ సేతుపతి షూటింగ్ సెట్స్‌లో పాల్గొన్నట్లు కూడా తెలుస్తోంది. పాత్ర చిన్నదైనా దాని ప్రాముఖ్యత మాత్రం భారీగా ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌తో ఫైట్ సీన్స్‌లో విజయ్ సేతుపతి చెప్పే డైలాగులు అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తాయని సినిమా యూనిట్ నమ్మకంగా చెబుతోంది.
ప్రస్తుతం సినిమా షూటింగ్ ముంబైలో వేగంగా జరుగుతోంది. మొత్తం షూటింగ్ వచ్చే పై ఏడాది సెప్టెంబర్‌లో పూర్తవుతుందని అంటున్నారు. అంటే ఈ సినిమాను థియేటర్లో చూడాలంటే ఇంకా దాదాపు రెండేళ్లు వేచి చూడాల్సిందే. ఇటీవల సోషల్ మీడియాలో, "అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేయడానికి పెద్ద హీరోలు భయపడుతున్నారు" అని వార్తలు వచ్చాయి. అయితే విజయ్ సేతుపతి లాంటి స్టార్, బన్నీతో స్క్రీన్ షేర్ చేయడానికి ముందుకు రావడంతో అభిమానులు ఆనందపడుతున్నారు. అట్లీ డైరెక్షన్‌కి కూడా ఇదే కారణంగా మంచి క్రెడిట్ దక్కుతోంది. అట్లీ ఏ మాయ చేసి విజయ్ సేతుపతిని ఒప్పించాడో తెలియదు కానీ, అల్లు అర్జున్‌పై ట్రోల్స్ చేసే వారికి మాత్రం ఈ వార్త గట్టి కౌంటర్ అయ్యింది.