తెలుగు సినీ పరిశ్రమలో అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో
పోకిరి మూవీ ఒకటి. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన
గోవా బ్యూటీ ఇలియానా ఈ
మూవీ లో హీరోయిన్గా నటించింది. డేరింగ్ అండ్ డాషింగ్
డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు
మణిశర్మ సంగీతం అందించాడు. ఈ
మూవీ లో
ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించాడు. ఈ
మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అప్పటివరకు ఏ తెలుగు
సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాలో విలన్ గ్యాంగ్ లో ఓ లేడీ విలన్ పాత్ర ఉంటుంది. ఆమె ఈ సినిమాలో ఎప్పుడు మహేష్ బాబు వెంటపడుతూ ఉంటుంది. కానీ మహేష్ బాబు మాత్రం ఆమెను దూరం పెడుతూ ఉంటాడు. ఇక ఈ సినిమాలో
ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఒక సన్నివేశంలో
ప్రకాష్ రాజ్ ఆమెను గిల్లితే ఆమె అరుస్తోంది. దానితో
ప్రకాష్ రాజ్ గిల్లితే గిల్లించుకోవాలి ఆరవకూడదు అని అంటాడు. ఈ డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది. ఈ సినిమాలో లేడీ విలన్ పాత్రలో నటించిన ముద్దుగుమ్మ పేరు షీవా రానా.
పోకిరి సినిమా ద్వారా ఈ
బ్యూటీ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది.
ఆ తర్వాత ఈమె పెద్దగా తెలుగు సినిమాల్లో నటించలేదు. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ కుర్ర కారును ఫీదా చేస్తూ వస్తుంది.
పోకిరి సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న ఇప్పటికీ ఈమె అదిరిపోయే రేంజ్ లో అందాలను మెయింటైన్ చేస్తూ వస్తుంది.