`ఢీ` షోకు రెజీనా రెమ్యున‌రేష‌న్‌.. ఓరి దేవుడా సినిమాల కంటే ఎక్కువ సంపాదిస్తుందిగా!

Kavya Nekkanti
తెలుగు బుల్లితెర‌పై అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన రియాలిటీ షోస్‌లో `ఢీ` ఒక‌టి. ఈటీవీలో 2009లో ప్రారంభ‌మైన ఈ డాన్స్ కంపిటిషన్ షో ఇప్ప‌టికే అనేక సీజ‌న్స్ కంప్లీట్ చేసుకుంది. ఢీ షో వల్ల చాలా మంది డ్యాన్సర్స్, కొరియోగ్రాఫర్స్, యాక్టర్స్ కి అవకాశాలు వచ్చాయి. కొంతమంది కంటెస్టెంట్స్ ఆ తర్వాత సినిమాల్లో డ్యాన్స్ మాస్టర్స్‌గా, హీరోలుగా, కామెడీ ఆర్టిస్టులుగా కూడా స్థిరపడ్డారు. ప్ర‌స్తుతం ఢీ 20 ర‌న్ అవుతోంది. ఈ సీజ‌న్ కు విజ‌య్ బిన్ని మాస్ట‌ర్ తో పాటు ప్ర‌ముఖ హీరోయిన్ రెజీనా కాసాండ్రా న్యాయ‌నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.


ఒక‌ప్పుడు టాలీవుడ్ లో రెజీనా క్రేజీ హీరోయిన్‌. ముఖ్యంగా టైర్ 2 హీరోల‌కు మోస్ట్ వాంటెడ్‌గా ఉండేది. కానీ స‌క్సెస్ రేటు అంత‌గా లేక‌పోవ‌డం, కుర్ర హీరోయిన్ల తాకిడి ఎక్కువ‌గా ఉండ‌టంతో రెజీనాకు టాలీవుడ్‌లో ఆఫ‌ర్లు క‌రువ‌య్యాయి. ప్ర‌స్తుతం తమిళ్‌, హిందీ భాష‌ల్లో అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ కెరీర్ ను సాగిస్తోంది. అలాగే తెలుగులో ఢీ20కి జ‌డ్జిగా చేస్తూ తెలుగు ఫ్యాన్స్ ను అల‌రిస్తోంది.


ఈ డాన్స్ షోకు రెజీనా కొత్త గ్లామ‌ర్ ను జోడించింది. స్క్రిప్టెడ్ కాకుండా కంటెస్టెంట్స్ పెర్ఫార్మెన్స్ అనంత‌రం జ‌డ్జిమెంట్ కూడా క్లారిటీతో ఇస్తుంది. అందుకు త‌గ్గ‌ట్లే రెమ్యున‌రేష‌న్ కూడా ఛార్జ్ చేస్తుంది. ఢీ 20 షో ఈటీవీలో బుధ, గురువారాల్లో రాత్రి 9:30 గంటలకు ప్రసారమవుతుంది. అయితే ఒక్కో ఎపిసోడ్ కోసం రెజీనా రూ. 5 ల‌క్ష‌లు పారితోషికం పుచ్చుకుంటుంద‌ట‌. అలాగే ఆమె కో-జ‌డ్జ్ విజ‌య్ బిన్ని మాస్ట‌ర్ రూ. 4 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తున్నాడ‌ని స‌మాచారం. రెజీనా క్రేజ్ దృష్ట్యా విజ‌య్ కంటే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ ఆమెకు ఇస్తున్నార‌ని టాక్‌. ఇక ఇది తెలిసి ఓరి దేవుడా అంటూ నెటిజ‌న్లు నోరెళ్ల‌బెడుతున్నారు. సినిమాల కంటే ఢీ షో ద్వారానే రెజీనా ఎక్కువ సంపాదిస్తుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: