బాలకృష్ణ : వాటిని నేను అస్సలు పట్టించుకోను.. నాకు అవంటే భయం..?
ఈ సన్మాన కార్యక్రమానికి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు హాజరు అయ్యారు. ఈ సన్మాన కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ కొన్ని అద్భుతమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా బాలకృష్ణ మాట్లాడుతూ ... నాది చాలా పెద్ద కుటుంబం. సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన దర్శక , నిర్మాతలు. నటీ నటులు , సాంకేతిక నిపుణులు. మరియు నా అభిమానులు , నా హిందూపూర్ నియోజకవర్గం సభ్యులు వీరంతా నా కుటుంబం. అందుకే నా కుటుంబం చాలా పెద్దది. నాకు నాన్న దీన్ని వారసత్వంగా ఇచ్చారు అని బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. నాకు అంకెలు అంటే చాలా భయం. నేను ఎన్ని సినిమాలు చేశాను అన్నది గుర్తుపెట్టుకుంటాను కానీ ఆ సినిమాలు ఎలాంటి రికార్డ్స్ కొట్టాయి అనేది అస్సలు గుర్తు పెట్టుకోను.
నాన్న గారి బాట లోనే పయనిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సినిమా ఇండస్ట్రీ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. మన తెలుగు సినిమా ఇప్పటికే ఆస్కార్ స్థాయికి చేరుకుంది అని బాలకృష్ణ తాజాగా చెప్పకచ్చాడు.