మెగాస్టార్
చిరంజీవి ప్రస్తుతం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వర
ప్రసాద్ అనే సినిమాలో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 22 వ తేదీన
చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ
మూవీ నుండి మేకర్స్ ఒక చిన్న గ్లిమ్స్ వీడియోని విడుదల చేశారు. ఇందులో
చిరంజీవి కోట్ సూటు వేసుకొని అదిరిపోయే రేంజ్ స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ఇక ఈ
మూవీ గ్లిమ్స్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది.
ఈ సినిమాలో
విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ఈ
మూవీ దర్శకుడు అయినటువంటి
అనిల్ రావిపూడి అధికారికంగానే ప్రకటించాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం
వెంకటేష్ ఈ
మూవీ షూటింగ్ లో
సెప్టెంబర్ 3 వ తేదీ నుండి జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ లోని ఎం ఎస్ జి లో
వెంకటేష్ పోర్షన్ చిత్రీకరణను
సెప్టెంబర్ 3 వ తేదీ నుండి ఈ
మూవీ బృందం వారు స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చిరు ,
వెంకటేష్ ఇద్దరు కూడా ఒక హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ షెడ్యూల్ కు సంబంధించిన పనులు చక చక జరుగుతున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి హీరో గా నటిస్తున్న
మూవీ కావడం , దానికి
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ఉండడం అందులో
విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలకమైన పాత్రలో నటించనుండడంతో మన శంకర వర
ప్రసాద్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.