అంత్యక్రియల్లో అయాన్ పెత్తర పనులు..అల్లు అర్జున్ కొడుకు పై పనికిమాలిన ట్రోలింగ్(వీడియో)..!

Thota Jaya Madhuri
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత మన సమాజంలో కొందరు వ్యక్తులు పూర్తిగా హద్దులు మీరుతూ ప్రవర్తిస్తున్నారని చెప్పాలి. ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో వయస్సు, స్థాయి అనే తేడా లేకుండా ఎవరినైనా ఎలాంటి మాటలతోనైనా అవమానించడం, ఎగతాళి చేయడం జరుగుతున్న దాన్ని మనం ప్రతిరోజూ చూస్తున్నాం. ముఖ్యంగా సెలబ్రిటీల కుటుంబ సభ్యులను, పిల్లలను కూడా వదలకుండా ట్రోలింగ్ చేయడం ఒక రకమైన ఫ్యాషన్‌లా మారిపోయింది. ఇప్పుడా ట్రోలింగ్ బారిన పడ్డ వ్యక్తి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కుమారుడు అయాన్. చిన్న వయస్సులో ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అతనిపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. చిన్నపిల్లాడు కావడంతో సహజంగానే బొద్దుగా, గుండ్రంగా కనిపిస్తాడు. కానీ కొంతమంది ఆకతాయిలు ఈ విషయాన్ని హాస్యాస్పదంగా మార్చి "నువ్వు హీరో అవుతావా?", "నీ బాడీ చూడూ!" అంటూ కఠినమైన కామెంట్లు చేస్తూ ఉంటారు.



తాజాగా అల్లు అర్జున్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన నానమ్మ గారు కన్నుమూశారు. ఈ అంత్యక్రియలకు సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన ఒక చిన్న ఘటన అయాన్‌ను మరోసారి సోషల్ మీడియా ట్రోలింగ్ బారిన పడేలా చేసింది. అంత్యక్రియల సమయంలో నానమ్మ పార్థివ దేహంపై ఉంచిన పూలమాలను అయాన్ తీసుకుని తన మెడలో వేసుకున్నాడు. ఇది చిన్నపిల్లాడి అమాయకపు చేష్ట. అతనికి ఆ పరిస్థితి  తెలియకపోవడం సహజమే. కానీ ఈ సన్నివేశాన్ని వీడియోలో చూసిన కొంతమంది నెటిజన్లు అతనిపై దారుణమైన కామెంట్లు చేస్తూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. "ఇలాంటి పని చేసావా?", "బ్రెయిన్ లేనట్టుందే?" వంటి వ్యాఖ్యలు చేస్తూ అతన్ని ఎగతాళి చేస్తున్నారు.



ఈ పనికిమాలిన ట్రోలింగ్ చూసి అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ఒక చిన్నపిల్లాడిని కూడా ఇలా టార్గెట్ చేయడమా?", "పిల్లాడి అమాయకపు చేష్టలకూ ఇంత హద్దు మీరి స్పందించడమా?" అంటూ మండిపడుతున్నారు. చాలా మంది సోషల్ మీడియాలో ఇలా అమాయకపు పిల్లలపై ట్రోలింగ్ చేయడం అనేది సమాజంలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. వాస్తవానికి, అయాన్ ఎప్పుడూ అల్లరి పిల్లాడిలానే ఉంటాడు. చిన్నపిల్లలందరూ అలా ఉంటారు. కానీ సోషల్ మీడియాలో అతనిని మాత్రమే ప్రత్యేకంగా టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయడం అభిమానులకు బాధాకరంగా మారింది. ఈ వీడియో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. కొందరు వ్యంగ్యంగా మీమ్స్ తయారు చేస్తుంటే, మరికొందరు "ఇంత చిన్న వయస్సులో ఉన్న పిల్లాడిపై ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేయడం అసహ్యం" అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: