క్రిష్ నెక్ట్స్ మూవీ బాల‌య్య‌తోనే... ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సీక్వెల్ ఫిక్స్‌...?

RAMAKRISHNA S.S.
ఆదిత్య 999 న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ఈ సినిమా గురించి సినీ వర్గాల్లో ఎప్ప‌టి నుంచో చర్చ జరుగుతోంది. గతంలో బాలయ్య నటించిన ఆదిత్య 369 తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. అప్పటి నుంచే ఆ చిత్రానికి సీక్వెల్ తీయాలన్న కోరిక బాలయ్య మనసులో ఉంది. ఆదిత్య 369 దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతోనే సీక్వెల్ చేయాలని మొదట అనుకున్నా, ఆయన వయసు కారణంగా, ఫామ్ కోల్పోవడం వల్ల ఆ ఆలోచన ఆగిపోయింది.


ఇక ఈ ప్రాజెక్ట్ కోసం బాలయ్య స్వయంగా స్క్రిప్ట్ వర్క్‌లో పాల్గొని స్టోరీబోర్డ్ వరకు రెడీ చేశారు. ఒకానొక టైంలో తానే దర్శకుడిగా వ్యవహరించాలనుకున్నా ఆ ఆలోచనను తరువాత వదిలేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొత్తగా దర్శకుడిగా క్రిష్ పేరు వినిపిస్తోంది. బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి చేసిన క్రిష్, మరోసారి ఆయనతో కలసి ఈ ప్రాజెక్ట్‌కి మెగాఫోన్ పట్టే అవకాశం ఉందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. శాత‌క‌ర్ణి త‌ర్వాత క్రిష్ బాల‌య్య‌తో ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు సినిమాలు డైరెక్ట్ చేసినా అవి రెండు అప్పుడున్న రాజ‌కీయ ప‌రిస్థితుల్లో స‌రిగా ఆడ‌లేదు.


ఈ క్రేజీ సీక్వెల్‌లో మరో ఆసక్తికర అంశం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ. ఈ సీక్వెల్‌లో ఆయన కూడా కీలక పాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై క్రిష్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఘాటి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాన్ని అడిగినప్పుడు, “ఆదిత్య 999 గురించి మాట్లాడాల్సింది బాలయ్యే. నేను చెప్పలేను” అని సమాధానం ఇచ్చారు. అలాగే మోక్షజ్ఞ నటిస్తాడన్న ప్రశ్నపై కూడా అదే విధంగా స్పందించారు. ఘాటి నిర్మాత, క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డి మాత్రం ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయనే సంకేతం ఇచ్చారు. కానీ అంతకుమించి వివరాలు బయటపెట్టలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ వాస్తవంగా లాక్ అయ్యిందా? లాంచ్ ఎప్పుడు జరుగుతుంది? అన్న ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: