స్టార్ హీరోలకు కూడా దక్కని ఛాన్స్ కొట్టేసిన రాఘవ లారెన్స్.. "కాంచన 4"కి అదే స్పెషల్ అట్రాక్షన్ కానుందా..?

Pulgam Srinivas
డాన్స్ కొరియో గ్రాఫర్ గా , నటుడిగా , దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో రాఘవ లారెన్స్ ఒకరు. ఈయన మొదటగా డాన్స్ కొరియో గ్రాఫర్ గా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత పలు సినిమాలలో నటించి నటుడిగా కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకొని ఆ తర్వాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి వాటిలో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని దర్శకుడిగా కూడా తానేంటో నిరూపించుకున్నాడు. రాఘవ లారెన్స్ కి అద్భుతమైన గుర్తింపును తీసుకువచ్చిన మూవీలలో కాంచన సిరీస్ ప్రధమ స్థానంలో ఉంటుంది.


ఈయనకు కాంచన సిరీస్ మూవీల ద్వారా అద్భుతమైన గుర్తింపు దక్కింది. తాజాగా కాంచన 4 మూవీ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే ... కాంచన 4 మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అయినటువంటి పూజా హెగ్డే నటించబోతున్నట్లు చాలా రోజులుగా ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ లో పూజా హెగ్డే తో పాటు రష్మిక మందన కూడా నటించబోతున్నట్లు , ఆల్రెడీ ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.


ఒక వేళ నిజం గానే కాంచన 4 మూవీ లో పూజా హెగ్డే , రష్మిక మందన ఇద్దరు గనుక నటించినట్లయితే ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. దానికి ప్రధాన కారణం పూజా హెగ్డే , రష్మిక మందన ఇద్దరు కూడా అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లు. ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాల్లో కూడా వీరిద్దరూ కలిసి నటించలేదు. అలాంటిది ఈ సినిమాలో ఈ ఇద్దరు స్టార్ బ్యూటీస్ నటించినట్లయితే ఇప్పటికే కాంచన 4 పై మంచి అంచనాలు ఉండడంతో , ఆ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: