“డిసెంబర్ బాక్సాఫీస్ ఖాళీనా..? స్టార్ సినిమాలు ఎక్కడ?”

Amruth kumar
టాలీవుడ్ లో స్టార్ సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పుడూ హాట్ టాపిక్. ఫలానా సినిమా ఫలానా డేట్ కి వస్తుంది అని మేకర్స్ ముందే అనౌన్స్ చేస్తారు. కానీ ఆ టైమ్‌కి సినిమా పూర్తవుతుందా? పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పటికి పూర్తవుతుంది? అన్న అనుమానాలు అభిమానుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ తప్పక వస్తాయి. అయినా ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ చేయడం వల్లే సినిమాలకు అదనపు బూస్ట్ లభిస్తుంది. సంక్రాంతి, దసరా, దీపావళి, క్రిస్మస్ - ఈ పండుగల సీజన్ లో రిలీజ్ అయిన సినిమాలు చాలా సార్లు బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. OG, అఖండ 2 – దసరా మిస్సయిన భారీ సినిమాలు .. ఈ దసరాకి పవన్ కళ్యాణ్ “OG”, బాలయ్య “అఖండ 2” రావాల్సింది. కానీ పరిస్థితులు మారడంతో అఖండ 2ని మేకర్స్ వాయిదా వేశారు.



 కొత్త రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ, సంక్రాంతికి వస్తుందని బలమైన టాక్. ఇక పవన్ కళ్యాణ్ “OG” కూడా దసరా మిస్సయింది. దీంతో ప్రేక్షకుల్లో నిరాశ పెరిగింది. ప్రభాస్ రాజా సాబ్ – డిసెంబర్ నుంచి సంక్రాంతికి షిఫ్ట్ .. ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాజా సాబ్ అసలే డిసెంబర్ 5న రిలీజ్ అవ్వాల్సింది. కానీ షెడ్యూల్స్, పనులు పూర్తి కాకపోవడంతో జనవరి 9కి వాయిదా వేశారు. దీంతో డిసెంబర్ నెలలో పెద్ద సినిమాల జోరు ఒక్కసారిగా తగ్గిపోయింది.డిసెంబర్ సీజన్ టాలీవుడ్ కి బంగారు పంటే. గతంలో పుష్ప 1, అఖండ, సలార్ వంటి సినిమాలు డిసెంబర్ లో రిలీజ్ అయి సంచలన విజయాలు సాధించాయి. ఆ హైప్ వల్ల ఈసారి కూడా డిసెంబర్ నెలకి మాస్ బ్లాక్‌బస్టర్ సినిమాలు వస్తాయని ట్రేడ్ సర్కిల్స్ ఆశించారు. కానీ పెద్ద సినిమాలు వాయిదా పడడంతో సీన్ ఖాళీ అయిపోయింది.



ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, నవంబర్ 28న రామ్ ఆంధ్రా కింగ్ తో వస్తున్నారు. ఈ సినిమా క్రేజీగా ఉండటంతో డిసెంబర్ లక్ మొత్తం రామ్ దే అని చెప్పొచ్చు. ఇక అడివి శేష్ డెకాయిట్ కూడా డిసెంబర్ 25న క్రిస్మస్ టైం లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీకి ఉన్న హైప్ వేరే లెవెల్లో ఉంది. ఫుల్ క్రేజీగా ఉండే ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్, క్రిస్మస్ హాలిడే సీజన్ బెనిఫిట్ పూర్తిగా వాడుకునే అవకాశం ఉంది.ఈసారి డిసెంబర్ లో ప్రభాస్, బాలయ్య, పవన్ లాంటి స్టార్ సినిమాలు లేకపోయినా, రామ్ “ఆంధ్రా కింగ్”, అడివి శేష్ “డెకాయిట్” లాంటి క్రేజీ మూవీస్ పండగ వాతావరణం సృష్టించబోతున్నాయి. డిసెంబర్ లో ఖాళీ సీన్ అనిపించినా, ఈ రెండు సినిమాలు థియేటర్లలో వేడి పెంచే అవకాశమే ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: