తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన షాక్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. కానీ ఈ సినిమా ఈయనకు నిరాశను మిగిల్చింది. ఆ తర్వాత మిరపకాయ్ సినిమాకు ఈయన దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఈయన దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో తెలుగు సినీ పరిశ్రమలో ఈయన క్రేజ్ పెరిగిపోయింది.
ఇకపోతే గబ్బర్ సింగ్ సినిమా తర్వాత ఈయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించిన మళ్ళీ ఆ స్థాయి విజయం ఈయనకు దక్కలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశి కన్నా , శ్రీ లీల హీరోయిన్లుగా ఉస్తాది భగత్ సింగ్ అనే మూవీ ని రూపొందిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. మైత్రి సంస్థ వారు నిర్మిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గతంలో పవన్ హరీష్ కాంబోలో రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో వీరి కాంబోలో మరో మూవీ రాబోతుంది అనే వార్త బయటకు రావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు తారా స్థాయికి చేరాయి.
ఆ తర్వాత ఈ మూవీ తమిళ సినిమా అయినటువంటి తెరి కి రిమేక్ గా రూపొందుతుంది అనే వార్త వైరల్ కావడంతో చాలా మంది పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా డిసప్పాయింట్ అయ్యారు. అందుకు ప్రధాన కారణం ఈ మధ్య కాలంలో రీమిక్ సినిమాలను ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోవడం , అందులో తేరి సినిమా పోలీసోడు అనే టైటిల్ తో తెలుగులో కూడా ఆల్రెడీ విడుదల కావడంతో చాలా మంది ఈ సినిమాపై డిసప్పాయింట్ అయ్యారు.
ఇక ఇప్పటివరకు ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన అన్ని ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉన్నా కూడా ఈ సినిమా రీమిక్ సినిమా అనే వార్తలు వైరల్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయికి చేరడం లేదు. ఈ మూవీ స్క్రీన్ ప్లే రైటర్ అయినటువంటి దశరథ్ ఓ ఇంటర్వ్యూ లో ఈ సినిమా ఏ మూవీ కి రిమేక్ కాదు అని ప్రకటించాడు. ఒక వేళ ఈ సినిమా నిజం గానే ఏ మూవీ కి రీమేక్ కానట్లయితే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు స్థాయికి చేరే అవకాశం ఉంటుంది అని పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా అభిప్రాయ పడుతున్నారు.