తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం వరుస పెట్టి విజయాలను అందుకుంటూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒకరు. నాని ఈ మధ్య కాలంలో నటించిన చాలా సినిమాలు మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి. ఆఖరుగా నాని హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా ... శ్రీ నిధి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది.
ఈ మూవీ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం నాని , శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే నాని , శ్రీకాంత్ కాంబోలో రూపొందిన దసరా మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో ది ప్యారడైజ్ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే సంవత్సరం మార్చి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటలలో ఒకరు అయినటువంటి జగపతిబాబు జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే.
తాజాగా ఈ టాక్ షో కు నాని గెస్ట్ గా వచ్చాడు. ఈ టాక్ షో లో భాగంగా జగపతి బాబు , నాని ని ఏదైనా సహాయం అవసరం పడితే , అర్ధరాత్రి అయినా సరే ఏ మాత్రం మొహ మాట పడకుండా మెసేజ్ చేసే బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా నీకు ఇండస్ట్రీ లో ఉన్నారా అని నాని ని ప్రశ్నించాడు. అందుకు నాని సమాధానం చెబుతూ ... రానా దగ్గుబాటి , ఆది పినిశెట్టి , నీరజ కోన ఈ ముగ్గురు నాకు ఇండస్ట్రీ లో నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు.