కన్నడ నటుడు యాష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కొంత కాలం క్రితం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జీ ఎఫ్ చాప్టర్ 1 మరియు కే జీ ఎఫ్ చాప్టర్ 2 సినిమాలలో
హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఈ సినిమాల కంటే ముందు యాష్ కి కేవలం
కన్నడ సినీ పరిశ్రమలో మాత్రమే గుర్తింపు ఉండేది. ఈ రెండు సినిమాలు విడుదల అయ్యి అద్భుతమైన విజయాలను అందుకోవడంతో యాష్ కి
ఇండియా వ్యాప్తంగా గొప్ప గుర్తింపు వచ్చింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం యాష్ "టాక్సిక్" అనే సినిమాలో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. కే జీ ఎఫ్ చాప్టర్ 1 , కే జీ ఎఫ్ చాప్టర్ 2 లాంటి భారీ విజయాల తర్వాత యాష్ నుండి రాబోతున్న
సినిమా కావడంతో ఈ
మూవీ పై
ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ
సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ బుక్ మై షో ప్లాట్ ఫామ్ లో అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకుంటుంది.
ఈ
సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులు ఉండగానే బుక్ మై షో లో ఈ
మూవీ కి అద్భుతమైన ఇంట్రెస్ట్ లు దక్కుతున్నాయి. బుక్ మై షో లో టాక్సిక్
మూవీ కి ప్రస్తుతం 200 కే ఇంట్రెస్ట్ లు లభించాయి. ఇలా ఈ
మూవీ విడుదలకు చాలా రోజుల ముందే ఈ స్థాయి ఇంట్రెస్ట్ లు బుక్ మై షో లో లభించడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి అనే అంచనాకు చాలా మంది జనాలు వస్తున్నారు. మరి ఈ సినిమాతో యాష్ కి ఏ స్థాయి విజయం దక్కుతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.