అనిల్ రావిపూడి కి బిగ్ షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్.. చిరంజీవి సినిమా నుంచి అవుట్..!?
ఈ సినిమా ప్రారంభం నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. నయనతార మెయిన్ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. అదే సమయంలో సెకండ్ హీరోయిన్‌గా కేథరిన్ తెరిసా ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. కేథరిన్‌కి ఇది ఒక మంచి బ్రేక్ అవుతుందని, చిరంజీవితో స్క్రీన్ షేర్ చేయడం ద్వారా మరోసారి గ్లామర్ మార్కెట్ పెరుగుతుందని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నుంచి కేథరిన్ తెరిసా తప్పుకున్నట్టు తెలుస్తోంది. కారణం ఏమిటంటే, ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
ఒకవైపు కేథరిన్ అభిమానులు ఈ వార్త విన్నాక నిరాశ చెందుతున్నారు. చిరంజీవి వంటి సూపర్ స్టార్‌తో నటించే అవకాశం దక్కడం అదృష్టం అని భావిస్తుంటే, కేథరిన్ దాన్ని ఉపయోగించుకోలేకపోవడం ‘బ్యాడ్ లక్’ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరోవైపు, కొంతమంది మాత్రం వేరే రకంగా విశ్లేషిస్తున్నారు. నయనతార లాంటి సీనియర్ హీరోయిన్ ఈ సినిమాలో ఉంటే, ఫోకస్ మొత్తం ఆమెపైనే ఉంటుందని, సెకండ్ హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యం ఉండదని కేథరిన్ ముందుగానే అర్థం చేసుకుని ఈ సినిమా నుంచి తప్పుకుందేమో అని చర్చిస్తున్నారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో బాక్సాఫీస్ హిట్ మెషీన్‌గా పేరుగాంచాడు. కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ పర్ఫెక్ట్‌గా మిక్స్ చేసే డైరెక్టర్‌గా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన దర్శకత్వంలో చిరంజీవి సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ఫ్యాన్స్‌లో భారీ ఎక్సైట్మెంట్ ఉంది. మెగాస్టార్ ప్రతి సినిమా టాలీవుడ్‌లో ఒక ఫెస్టివల్‌లా మారుతుందనే విషయం తెలిసిందే. అలాంటి ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకోవడం చాలా అరుదైన అవకాశం. ఈ సందర్భంలో కేథరిన్ తప్పుకోవడం నిజంగా సెన్సేషన్‌గా మారింది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. కానీ కేథరిన్ తప్పుకోవడానికి అసలు కారణం ఏమిటో అధికారికంగా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. నిజంగా ఆరోగ్య సమస్యలే కారణమా? లేక స్క్రిప్ట్‌లో తన పాత్రకు తగిన ప్రాధాన్యం లేదనే కారణమా? అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది. ఎలాగైనా, మెగాస్టార్ సినిమా నుంచి కేథరిన్ తప్పుకోవడం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సెకండ్ హీరోయిన్ ప్లేస్‌లో కొత్తగా ఎవరిని తీసుకుంటారో ..? కేథరిన్ తెరిసా లాంటి టాలెంటెడ్ హీరోయిన్‌కు చిరంజీవి సినిమా అవకాశం లభించడం నిజంగా పెద్ద విషయం. కానీ ఆమె తప్పుకోవడం వెనుక ఉన్న కారణాలు ఏవైనా సరే, ఇది ఆమె కెరీర్‌లో ఒక మిస్ అయిన ఛాన్స్ అని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ పాత్రకు ఎవరిని సైన్ చేస్తారో చూడాలి.