కేకోకేక..బాక్స్ ఆఫిస్ దుమ్ము లేపుతున్న ‘లిటిల్ హార్ట్స్’.. డబుల్ జాక్ పాటే ఇది..!
మౌళి ..ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. అదే విధంగా, డైరెక్టర్ సాయి మార్తాండ కి ఇది డెబ్యూ. కానీ ఆయన ఈ సినిమాను తెరకెక్కించిన తీరు చూసి ఎవరూ ఇది ఆయన మొదటి సినిమా అని అనలేరు. అనుభవజ్ఞుడైన దర్శకుడు తెరకెక్కించినట్టుగా ప్రతి సీన్‌ను చాలా రియలిస్టిక్‌గా, హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించారు. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్ మిడిల్ క్లాస్ యువతకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. ఈ సినిమాకు పోటీగా శివ కార్తికేయన్ నటించిన మద్రాసి, అలాగే అనుష్క శెట్టి నటించిన "ఘాటీ" సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే ప్రేక్షకులు ‘లిటిల్ హార్ట్’ సినిమా వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఘటి సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. మద్రాసి సినిమా కొంతమంది ప్రేక్షకులకు మాత్రమే ఆకట్టుకుంటే, లిటిల్ హార్ట్ మాత్రం అన్ని వర్గాల ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది.
ఈ సినిమా ఒకేసారి యువతను ఎంటర్‌టైన్ చేయడమే కాకుండా పెద్దవారిని ఆలోచింపజేస్తోంది. అందుకే మల్టీప్లెక్స్‌లలోనూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ట్రేడ్ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం, భారీ సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ ‘లిటిల్ హార్ట్’ సినిమా తనదైన మార్కెట్‌ను సృష్టించుకుంటోంది. కలెక్షన్లలో కూడా ఈ సినిమా సూపర్ స్ట్రాంగ్‌గా నిలబడుతోంది. సినిమా మేకర్స్ సైతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. “జాక్పాట్ కొట్టినట్టే” అంటూ సోషల్ మీడియాలో ఈ మూవీ టీంను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు జనాలు. చిన్న సినిమాలు కూడా కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవచ్చని ‘లిటిల్ హార్ట్’ మరొక్కసారి నిరూపించింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత ఘన విజయాన్ని అందుకోవడం ఖాయం అని ట్రేడ్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.