డిగ్లామర్ లుక్ లో మెరిసిన హీరోయిన్.. ఒక్క సినిమాకు తిరుగులేని రెమ్యునరేషన్...!
సీతారామం చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొట్టమొదటి సినిమా తోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకుంది . ఇక అనంతరం హాయ్ నాన్న మరియు ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలలో మెరిసింది . ప్రెసెంట్ ముద్దుగుమ్మ బాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టింది . అదే విధంగా తెలుగులోనూ ఒక సినిమా చేస్తుంది . ఆ సినిమా పేరు డెకాయిట్ . ఇందులో అడవి శేష్ హీరోగా నటిస్తున్నాడు .
ఈ మూవీకి ఈ బ్యూటీ ఏకంగా 2.5 కోట్లు పుచ్చుకుంటున్నట్లు సమాచారం . అలాగే ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్లలో మృణాల్ కూడా ఒకరు . బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు ఆమె ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది . ఇక సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది . ఒకపక్క చీర కట్టుతో మరో పక్క గ్లామరస్ ఫొటోస్ తో పిచ్చెక్కిస్తుంది . ప్రెసెంట్ ఈ భామ లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి .