పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ తాజాగా
హరి హర వీరమల్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవన్ నటించిన
సినిమా చాలా కాలం తర్వాత విడుదల కావడం తో ఆయన అభిమానులు ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ
మూవీ వారి అంచనాలను అందుకోలేక పోయింది. ఇక పవన్ తాజాగా ఓజి అనే సినిమాలో
హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ పై ప్రేక్షకులు అత్యంత భారీ అచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో
ప్రియాంక అరుల్
మోహన్ హీరోయిన్ గా నటించగా ...
సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. డి వీ వీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు ఎస్ ఎస్
తమన్ సంగీతం అందించగా ... ఇమ్రాన్ హష్మీ ఈ
మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.
అర్జున్ దాస్ ఈ
మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. శ్రియ
రెడ్డి ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుంది. ఇకపోతే ఈ సినిమాను
సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల
థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కర్ణాటక ఏరియా
థియేటర్ హక్కులను కూడా ఈ
మూవీ యూనిట్ వారు అమ్మి వేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
సినిమా యొక్క కర్ణాటక హక్కులను జేపిఆర్ ఫిలిమ్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఈ సంస్థ ఈ
మూవీ యొక్క కర్ణాటక ఏరియా
థియేటర్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక జెపిఆర్ ఫిలిమ్స్ సంస్థ వారు ఈ
మూవీ ని కర్ణాటక ఏరియాలో చాలా పెద్ద ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.