ఇంటికి పిలిచి తేజ సజ్జా కి ఆఫర్ ఇచ్చిన పాన్ ఇండియా డైరెక్టర్..ఇది అసలు సిసలైన హిట్ అంటే..!?
అయితే ఈ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేశాడు హీరో తేజ సజ్జ. అతను తాజాగా ‘మీరాయి’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాను తేజ సజ్జ తన అంకితభావంతో, కష్టపడి నటించాడు. డైరెక్టర్ వేరే స్థాయి టెక్నికల్ స్టాండర్డ్స్‌తో తీర్చిదిద్దాడు. సినిమా విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా విజయం తేజ సజ్జ ప్రతిభను మరోసారి రుజువు చేసింది. ఈ హిట్ తర్వాత ప్రత్యేకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు సుకుమార్ తేజ సజ్జ ప్రతిభను గుర్తించి అతనికి వ్యక్తిగతంగా ఫోన్ కాల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, సుకుమార్ - తేజ సజ్జను తన ఇంటికే పిలిపించి అతనికి ఓ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు కూడా ఫిలిం సర్కిల్స్‌లో గాసిప్ న్యూస్ బాగా హాట్‌గా ట్రెండ్ అవుతోంది. సుకుమార్ తేజ సజ్జతో త్వరలో ఒక సినిమా డైరెక్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో ముందడుగు వేసినట్లు న్యూస్ లు వినిపిస్తున్నాయి.
సాధారణంగా చిన్న హీరోలు పెద్ద విజయాన్ని సాధించినా, వారిని ఈ స్థాయిలో ప్రోత్సహించడం చాలా అరుదు. కానీ సుకుమార్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం అందరి మనసులను గెలుచుకుంది. ఇండస్ట్రీలో ఈ సంఘటన ఒక మంచి పాజిటివ్ వైబ్స్ కలిగించేలా మారింది. ఒక చిన్న హీరో కృషి, పట్టుదలతో విజయాన్ని సాధిస్తే, అతనికి ఈ విధంగా ప్రోత్సాహం ఇవ్వడం ఎంత ముఖ్యమో సుకుమార్ చూపించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.