టాలీవుడ్
ఇండస్ట్రీ లో ప్రస్తుతం అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న
యువ నటులలో
తేజ సజ్జ ఒకరు. ఈయన కొంత కాలం క్రితం హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ
మూవీ పోయిన సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. హనుమాన్ లాంటి భారీ
సక్సెస్ తర్వాత
తేజ ,
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మీరాయ్ అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ
సినిమా తాజాగా
నవంబర్ 12 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషలలో విడుదల అయింది.
ఈ
మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ
మూవీ బుక్ మై షో లో ఓ రేర్ ఫీట్ ను సాధించింది. బుక్ మై షో లో ఈ సినిమాకు సంబంధించిన 1 మిలియన్ టికెట్లు ఇప్పటికే సేల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ
సినిమా విడుదల అయ్యి ఇప్పటికి కేవలం మూడు రోజులు మాత్రమే అవుతుంది. మూడు రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన 1 మిలియన్
టికెట్స్ బుక్ మై షో లో సేల్ అయ్యాయి అంటేనే అర్థం అవుతుంది ఈ
సినిమా ఏ స్థాయిలో ఇంపాక్ట్ ను చూపుతోందో.
ఇక ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే ఈ
మూవీ లాంగ్ రన్ లో భారీ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఈ
మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఈ
మూవీ కి మంచి టాక్ రావడంతో మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఆ తర్వాత రెండవ , మూడవ రోజులు కూడా ఈ
మూవీ కి అద్భుతమైన కలెక్షన్లు దక్కినట్లు తెలుస్తోంది. ఇలా ఈ
సినిమా ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది.