కుటుంబంలో గొడవలపై మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే.. ఆమె ఏమన్నారంటే?
ప్రముఖ టాలీవుడ్ నటి మంచు లక్ష్మి మరికొన్ని గంటల్లో దక్ష అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తమ కుటుంబ గొడవ గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిరాయ్ సినిమా సక్సెస్ ను తానూ కూడా ఎంజాయ్ చేస్తున్నానని ఆమె అన్నారు. ఫ్యామిలిలో ఎవరికీ సక్సెస్ వచ్చినా ఆ సక్సెస్ మా అందరి సక్సెస్ గా భావించి ఆనందిస్తానని ఆమె కామెంట్లు చేశారు.
ఒకరి కష్టం వృథా కావాలని తానూ ఎప్పుడూ భావించనని ఆమె వెల్లడించారు. నేను జీవిత పాఠాలు నేర్చుకోవాలని అనుకుంటానని కానీ కష్టానికి ప్రతిఫలం రాకుండా ఉండాలని ఎప్పుడూ కోరుకోనని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ రంగంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసనీ మంచు లక్ష్మి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక ఆర్టిస్ట్ గా వాళ్లకు సలహాలు ఇస్తానని మిరాయ్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేయాలనీ మనోజ్ కు మొన్న కలిసినప్పుడు చెప్పానని ఆమె పేర్కొన్నారు.
ఒక ఫ్యామిలిలో ఏదైనా సమస్య వచ్చిన సమయంలో అందరూ నలిగిపోతారని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. అలా జరగదని చెప్పడం అబద్దమని ఆమె కామెంట్లు చేశారు. కానీ మేము ఉండేది అద్దాల మెడలోనని మేము ఏం చెప్పినా తల, తోక కట్ చేసుకుని వాళ్లకు నచ్చినట్టు రాసుకునే రోజులివి అంటూ ఆమె కామెంట్లు చేశారు. అలాంటప్పుడు సైలెంట్ గా ఉండటమే ఉత్తమమని నాకు అనిపించి సైలెంట్ గా ఉన్నానని ఆమె వెల్లడించారు.
గతంలో ఏది తప్పు ఏది ఒప్పు అని ఆలోచించేదానినని ఇప్పుడు ఆలోచించడం లేదని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు అలా ఆలోచించడం లేదని దీని వల్ల నేను ఆనందంగా ఉంటానా బాధ పడతానా అని ఆలోచిస్తున్నానని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. జీవితంలో ఏదైనా మనకు ఒక పాఠం నేర్పడానికి వస్తుందని ఏది జరిగినా మౌనంగా ఆలోచిస్తే ప్రశాంతత లభిస్తుందని మంచు లక్ష్మి కామెంట్లు చేశారు.