బకాసుర రెస్టారెంట్’ – చిన్న సినిమా పెద్ద విజయం..!

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో ఇటీవ‌ల పెద్ద సినిమా లే కాదు .. చిన్న సినిమాలు ఎలాంటి అంచ‌నాలు లేని సినిమా లు కూడా చాలా సైలెంట్ గా థియేట‌ర్ల లోకి వ‌చ్చి సూప‌ర్ హిట్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు పెద్ద స్టార్ కాస్టింగ్ లేకుండా, పెద్ద బడ్జెట్ లేకుండా నిశ్శబ్దంగా విడుదలైన బకాసుర రెస్టారెంట్ సినిమా, థియేటర్లలోనే మంచి పేరు తెచ్చుకుని ఇప్పుడు ఓటిటిలో దుమ్మురేపుతోంది. ప్రేక్షకులు ఈ సినిమాని "సర్ప్రైజ్ ప్యాకేజ్" అని పిలుస్తున్నారు. కన్నప్ప, పరద, కూలి లాంటి సినిమాలను సైతం వెనక్కి నెట్టి, వరుసగా 24 రోజులుగా అమెజాన్ ఇండియాలో టాప్ 10లో నిలబడటం చిన్న విషయమేమీ కాదు. ఓన్లీ కంటెంట్‌తో, ఎలాంటి పెద్ద హీరో ఇమేజ్ లేకుండానే, ఇంత పెద్ద స్థాయిలో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించడం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.


పెద్ద సినిమాల నడుమ నిలబడటం చాలా కష్టమని అందరూ అనుకునే పరిస్థితిలో, బకాసుర రెస్టారెంట్ మాత్రం ఆ అపోహను చెరిపేసింది. కంటెంట్ బలం ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే విషయాన్ని మరొకసారి నిరూపించింది. ప్రేక్షకులు సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు. రివ్యూలు , వర్డ్ ఆఫ్ మౌత్ కలిసిపోవడంతో , బకాసుర రెస్టారెంట్ చిన్న సినిమా అనే ట్యాగ్ దాటి , ఒక "మస్ట్ వాచ్ మూవీ"గా మారింది.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: