20 ఏళ్లుగా ఛార్మితో బంధం.. ఫైనల్ గా ఓపెన్ అయినా పూరి జగన్నాథ్.!

Pandrala Sravanthi
దర్శకుడు పూరి జగన్నాథ్ హీరోయిన్, నిర్మాత అయినటువంటి ఛార్మికౌర్ ఇద్దరూ చాలా సంవత్సరాల నుండి సన్నిహితంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.కొంతమందేమో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటే మరి కొంతమందేమో ఫ్రెండ్స్ అంటారు. ఇలా ఇద్దరు ఏం చేసిన ఒకే దగ్గర ఉండి చేయడంతో పాటు పూరి జగన్నాధ్ దర్శకత్వం చేసే సినిమాలన్నింటికి ఛార్మి నిర్మాతగా చేయడంతో వీరిద్దరి మధ్య బంధం గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం హాట్ టాపిక్ గానే ఉంటుంది.అంతేకాదు ఛార్మి పూరీ జగన్నాథ్ వైవాహిక బంధంలో చిచ్చు పెట్టిందని ఇలా ఎన్నో రూమర్లు వినిపిస్తాయి. అయితే ఛార్మితో బంధం పై ఫైనల్ గా ఓపెన్ అయ్యారు పూరి జగన్నాథ్. 


ఆయన రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఛార్మికి పెళ్లి కాలేదు. యంగ్ ఏజ్ లో ఉంది. కాబట్టి అందరూ ఇలా మాట్లాడుతున్నారు. అదే పెళ్లయిన మహిళతోనో లేక లావుగా ఉన్న మహిళతోనో లేక 50 ఏళ్ల మహిళతోనో ఉంటే ఇలాగే మాట్లాడేవారా.. ఛార్మి యంగ్ కాబట్టి మా మధ్య ఏదో ఉంది అనే రూమర్లు క్రియేట్ చేస్తున్నారు. పెళ్లిళ్లు చేసుకున్న మనకు పైపై ఆకర్షణలు ఎక్కువ రోజులు నిలువవనే సంగతి తెలుసు. అలాంటప్పుడు ఈ రూమర్లు క్రియేట్ చేయడం అవసరమా. 13 ఏళ్ల వయసు నుండే ఛార్మి నాకు తెలుసు. 20 ఏళ్లుగా మా మధ్య స్నేహబంధం కొనసాగుతోంది. మా మధ్య స్నేహబంధమే ఎప్పటికీ శాశ్వతం.


అలాగే 10 సంవత్సరాల క్రితం నిర్మాతగా చేయాలనుకుంటున్నాను అని చెప్పింది.దాంతో మగవాళ్లకు ధీటుగా పని చేసే ఛార్మితో సినిమాలు చేయడం స్టార్ట్ చేశాను. ఆమె సెట్లో ఓ గొడ్డులా పనిచేస్తుంది. ప్రొడ్యూసర్ కావాలనే తన కోరికని తీర్చాను. ఒకప్పుడు హీరోయిన్ గా చేసిన బ్యూటీ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా చేస్తూ ఓ డైరెక్టర్ తో కలిసి వర్క్ చేస్తుంది అంటే కచ్చితంగా ఏదో ఉందని అనుకుంటారు అంటూ ఛార్మితో ఉన్న రిలేషన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పూరి జగన్నాథ్.అంతేకాదు ఎప్పటికీ  తమ మధ్య ఉండేది స్నేహమే అని క్లారిటీ ఇచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: