మచ్ అవైటెడ్ సినిమా "జిగ్రీస్" రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. ఆ స్పెషల్ డే రోజే..!
‘మ్యాడ్ స్క్వేర్’ లో ఆల్ రెడి రామ్ నితిన్ తన టాలెంట్ ప్రూవ్ చేసేసుకున్నారు. ఆయన నుండి వస్తున్న మరో ఆణిముత్యమే ఈ "జిగ్రీస్". ఇది పూర్తిగా ఫ్రెండ్స్ కార్ ట్రిప్ కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా. మన చుట్టూ జరిగే సంఘటనలు, యువత ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులు, స్నేహితుల మధ్య జరిగే అనుబంధాలు — ఇవన్నీ సినిమాకు ప్రాణం లాంటివి. ఈ చిత్రాన్ని చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి “ఇది మన కథే” అనే ఫీలింగ్ కలుగుతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకున్నాయి. రియలిస్టిక్ ప్రెజెంటేషన్, నేచురల్ డైలాగ్స్, యువతకు దగ్గరైన సబ్జెక్ట్ కారణంగా ‘జిగ్రీస్’పై బజ్ గణనీయంగా పెరిగింది. చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో “ఈ సినిమా నేటి తరం భావాలను ప్రతిబింబించే అద్భుత ప్రయత్నం” అంటూ ప్రశంసిస్తున్నారు.
ఈ చిత్రానికి నిర్మాతగా కృష్ణ వోడపల్లి వ్యవహరిస్తున్నారు. ఈ “జిగ్రీస్ కేవలం సినిమా కాదు, ఇది ఒక ఎమోషన్. ప్రతి స్నేహం, ప్రతి యువకుడి ప్రయాణం, ప్రతి జీవితపు క్షణం ఇందులో ప్రతిబింబిస్తుంది. సినిమా ముగిసిన తర్వాత ప్రేక్షకులు తమలో తాము ఆలోచించేలా చేస్తుంది” అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరో ముఖ్యమైన అప్డేట్ను మూవీ మేకర్స్ తాజాగా ప్రకటించారు. నవంబర్ 14వ తేదీ ఈ సినిమా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఆ ప్రత్యేక రోజును గుర్తించదగినదిగా మార్చేందుకు, ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఒక ప్రత్యేక పోస్టర్‌తో పాటు స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
ఈ సినిమా డైరెక్టర్ హరీష్ రెడ్డి ఉప్పల అలాగే సందీ ప్ రెడ్డి వంగా మంచి ఫ్రెండ్స్. ఈ సినిమాకి ఆయన పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది ఆయనే. ఇక కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. సినిమాలోని సాంగ్ రిలీజ్ చేసింది ఆయనే. ఈ నగరానికి ఏమైంది, మ్యాడ్ స్క్వేర్ లాంటి సోషల్-రీయలిస్టిక్ సినిమాల తరహాలోనే, ‘జిగ్రీస్’ కూడా ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించడానికి సిద్ధమవుతోంది. సినిమా టీమ్ నమ్మకం ఒక్కటే — “ఈ సినిమా చూసిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్‌ని మరింతగా ప్రేమిస్తారు… జీవితాన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకుంటారు.”