"మాస్ జాతర" ట్విట్టర్ రివ్యూ.. వింటేజ్ మాస్ మహారాజ్ ఈజ్ బ్యాక్.. ఫ్యాన్స్ నోట ఊహించని మాట.!

Pandrala Sravanthi
మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా మూవీ మాస్ జాతర విడుదలై మొదటి షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రవితేజ శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా డబుల్ ధమాకా అంటూ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా రివ్యూలు ఇస్తున్నారు. బాహుబలి ది ఎపిక్ మూవీకి పోటీగా విడుదలైన మాస్ మహా జాతర సినిమా చూసిన ప్రేక్షకులు వింటేజ్ మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ అంటూ ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు.. ముఖ్యంగా మాస్ జాతర సినిమా ఫస్టాఫ్ చూసిన చాలా మంది ప్రేక్షకులు మళ్లీ ఒకప్పటి రవితేజ ఎనర్జీని మాస్ జాతర మూవీలో  చూసామని, శ్రీలీల రవితేజ కాంబో అదుర్స్ అంటూ రివ్యూ ఇస్తున్నారు.


 అంతేకాదు మాస్ జాతర మూవీ డబుల్ హిట్ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు  పెడుతున్నారు. ఎందుకంటే శ్రీ లీల రవితేజ కాంబినేషన్లో వచ్చిన ధమాకా సూపర్ హిట్ అయింది. అయితే మళ్లీ వీరిద్దరి కాంబోలో వచ్చిన మాస్ జాతర డబుల్ ధమాకా అంటూ ట్విటర్ వేదికగా చాలామంది రవితేజ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.అంతే కాదు ఈ సినిమాలో మునపటి రవితేజ కామెడీ చూడవచ్చని, రవితేజ కామెడీ, డైలాగ్స్,మాస్ అప్పీల్ సినిమాకి హైలెట్ అంటూ రివ్యూ ఇస్తున్నారు. అలాగే రవితేజ శ్రీలీల కాంబోలో వచ్చే కామెడీ, రొమాన్స్ ప్రతి ఒక్క సీన్ అద్భుతంగా ఉన్నాయని రవితేజ ఖాతాలో మరో హిట్ ఖాయం అంటూ ట్వీట్లు  చేస్తున్నారు.. 


మాస్ జాతర ఫస్టాఫ్ లో రవితేజ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ కి అభిమానులకి థియేటర్లో పూనకాలే అంటూ ట్వీట్ చేస్తున్నారు.. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా సాలీడుగా ఉంది అని ట్వీట్లు చేస్తున్నారు. మరి ఫస్టాఫ్ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. సెకండాఫ్ ఎలా ఉంటుంది అనేదాన్ని బట్టి సినిమా ఫుల్ రివ్యూ ఉంటుంది. మరి ఫస్టాఫ్ సినిమాకి హైలెట్గా నిలిచింది.సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: