కొన్ని సంవత్సరాల క్రితం రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క శెట్టి , తమన్నా హీరోయిన్లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి పార్ట్ 1 , బాహుబలి పార్ట్ 2 అనే సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో దగ్గుపాటి రానా విలన్ పాత్రలో నటించాడు. నాజర్ , సత్య రాజ్ ఈ మూవీలో కీలక పాత్రలలో నటించారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కి కథను అందించాడు. ఈ రెండు భాగాలు అద్భుతమైన అంచనాల నడుమ విడుదల అయ్యి భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈ రెండు సినిమాలలోని కొన్ని సన్నివేశాలను కట్ చేసి ఈ రెండు భాగాలను ఒకే మూవీ లాగా బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన రెస్పాన్స్ జనాలను లభిస్తుంది. ఈ మూవీ ఇప్పటివరకు రీ రిలీజ్ లో భాగంగా రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. మరి ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.
రెండు రోజుల్లో ఈ సినిమాకు రీ రిలీజ్ లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13.80 కోట్ల కలెక్షన్లు దక్కగా , కర్ణాటక ఏరియాలో 2.25 కోట్లు , తమిళ్ , కేరళలో కలిపి 1.25 కోట్లు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకుని 3.35 కోట్లు , ఓవర్ సిస్ లో 10.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి ది ఏపిక్ మూవీ కి రీ రిలీజ్ లో భాగంగా 30.75 కోట్ల కలెక్షన్ దక్కాయి. ఇలా ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ ఇంపాక్ట్ ను చూపిస్తుంది.