“ఇక కేవలం వారం రోజులే”.. మెగాస్టార్ ఫ్యాన్స్‌కి బిగ్ గుడ్ న్యూస్ రెడీ..!
చిత్రంలో హీరోయిన్గా నయనతార నటిస్తోంది. ఆమెతో పాటు విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వీరి కాంబినేషన్ స్క్రీన్‌పై ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిరంజీవి – వెంకటేష్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం చాలా ఏళ్ల తర్వాత జరగబోతున్న అరుదైన ఘట్టం కావడంతో ఇది ఇప్పటికే సినిమా మీద బజ్‌ని మళ్లీ పెంచేసింది.ఇకపోతే, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అనీల్ రావిపూడి తన స్టైల్‌కి తగ్గట్లుగా స్క్రిప్ట్‌ని వేగంగా కానీ పర్ఫెక్ట్గా తెరకెక్కిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, టీమ్ ఇప్పుడు ఫైనల్ యాక్షన్ షెడ్యూల్లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లోని ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో మెగాస్టార్‌పై ఓ పవర్‌పుల్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సీన్ కోసం బిగ్ బడ్జెట్ కేటాయించారట. చిరంజీవి ఈ సీక్వెన్స్ కోసం ప్రత్యేకంగా ఫిట్‌నెస్‌పై కసరత్తులు కూడా చేశారట.
ఈ యాక్షన్ ఎపిసోడ్ పూర్తయిన వెంటనే సినిమా షూటింగ్ మొత్తంగా ముగిసిపోనుంది. అంటే ఇక కేవలం వారం రోజులలోపే షూటింగ్ ఫినిష్ కాబోతుందని సమాచారం. దాంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా ప్రారంభం కానున్నాయి.సినిమాకు సంగీతం అందిస్తున్నాడు భీమ్స్ సెసిరోలియో. మొత్తానికి, “మన శంకర వరప్రసాద్ గారు” సినిమా షూటింగ్ ఫైనల్ ఫేజ్‌లోకి రావడంతో మెగాస్టార్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఇక కేవలం వారం రోజులే మిగిలి ఉండటంతో, వచ్చే రోజుల్లో ఈ సినిమా నుంచి భారీ అప్డేట్లు రానున్నాయని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.తాజా అప్డేట్ల ప్రకారం, ఈ సినిమా 2026 సంక్రాంతి రేస్‌లో గ్రాండ్ రిలీజ్ కానుంది. అంటే, సంక్రాంతి బరిలో మెగాస్టార్ మరోసారి బాక్స్ ఆఫీస్‌ను కుదిపేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు.మెగాస్టార్ – అనీల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్ మొత్తానికి భారీ అంచనాలు ఉన్నాయి. అనీల్ కామెడీ టచ్‌తో పాటు చిరంజీవి ఎనర్జీ కలిస్తే — ఈ సంక్రాంతి నిజంగా ఫ్యాన్స్‌కి మాస్ ఫెస్ట్ అవడం ఖాయం..!