నాలుగు సినిమాలు.. మూడు ఇండస్ట్రీలు.. బ్యూటీ కెరియర్ ఇలా ఉందేంటి..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాక యువ నటీ మణులు ఒక ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఇతర ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఒక వేళ ఏదైనా ఒక ఇండస్ట్రీ లో ఒకటి , రెండు సినిమాలు చేశాక వేరే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తే అక్కడ మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాక మరో ఇండస్ట్రీ పై ఫోకస్ పెడుతూ ఉంటారు. ఇకపోతే ఓ యువ నటి మాత్రం ఇప్పటివరకు కేవలం నాలుగు సినిమాల్లో నటిస్తే అందులో మూడు ఇండస్ట్రీ సినిమాలు ఉండడం విశేషం. ఇంతకు ఆ నటిమని ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మణులలో ఒకరు అయినటువంటి శ్రీ నిధి శెట్టి. ఈ బ్యూటీ యాష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కే జి ఎఫ్ అనే సినిమాతో వెండి తెరకు పరిచయం అయింది.


ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దానితో ఈమెకు వరస పెట్టి సినిమాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ కే జి ఎఫ్ సినిమా తర్వాత ఈమెకు తదుపరి మూవీ అవకాశం రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. ఈమె కే జి ఎఫ్ సినిమా తర్వాత తమిళ నటుడు అయినటువంటి విక్రమ్ హీరోగా రూపొందిన కోబ్రా అనే తమిళ సినిమాలో నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత నెక్స్ట్ సినిమా ఆఫర్ కోసం కూడా ఈమె చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది.


ఆ తర్వాత ఈమె నాని హీరోగా రూపొందిన హిట్ ది థర్డ్ కేస్ అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది  ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి విజయం దక్కింది. ఈ సినిమా తర్వాత ఈమె తాజాగా సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన తెలుసు కదా అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కి మంచి టాక్ వచ్చినా ఈ సినిమా పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయింది. ఇలా ఇప్పటివరకు శ్రీ నిధి శెట్టి కేవలం నాలుగు సినిమాల్లో నటిస్తే అందులో మూడు ఇండస్ట్రీ మూవీలు ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: