ఎనర్జీ కోసం స్మశానానికి వెళ్తా.. వింత కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్!
తాజాగా కామాక్షి భాస్కర్ల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. ఇటీవల అల్లరి నరేష్ నటించిన 12A రైల్వే కాలనీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ.. తన మనసుకు శాంతిని బలాన్ని ఇచ్చే వింత అలవాటు గురించి తెలియజేసింది కామాక్షి. తాను ' లో ' గా లేదా ఏదైనా నిరుత్సాహంగా ఫిల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తాను స్మశానానికి వెళుతూ ఉంటానని తెలియజేసింది.
అక్కడకి వెళ్తే తాను బూస్టప్ అవుతానని మనసుకి ఏదో తెలియని ప్రశాంతత లభిస్తుందంటూ తెలిపింది. ఈ విషయం విన్న అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా అక్కడికి వెళ్లాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ కామాక్షి మాత్రం తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెప్పడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. కామాక్షి భాస్కర్ల సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మా ఊరి పొలిమేర 3, మెన్షన్ హౌస్ మల్లేష్ తదితర చిత్రాలను నటిస్తోంది. సినిమాలలోనే కాకుండా పలు రకాల వెబ్ సిరీస్లలో కూడా నటించి బాగానే పేరు సంపాదించింది.