రాజ్‌తో సమంత రొమాంటిక్ ఫోజులు... బాలయ్య పాటతో “రాడ్” దించి పడేస్తున్న ఫ్యాన్స్!

Thota Jaya Madhuri
సోషల్ మీడియాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది సమంత – రాజ్ నిడుమోరు జంట. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా ముంబైలో జరిగిన ఒక ఈవెంట్‌లో వీరిద్దరూ కలిసి హాజరయ్యారు. ఆ ఈవెంట్‌లో రాజ్‌ని సమంత హగ్ చేసుకుంటూ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ ఫోటోని సమంత స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో, అభిమానులు, నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఇక ఆ ఫోటో చూసిన చాలా మంది అభిమానులు ఒకే మాట చెబుతున్నారు — “ఇదేనా కొత్త జంట?” అంటూ కామెంట్స్ వరద కురిపిస్తున్నారు. కొందరు వీరిద్దరూ త్వరలోనే అధికారికంగా తమ రిలేషన్‌షిప్‌ని ప్రకటించబోతున్నారని ఊహిస్తున్నారు. మరికొందరైతే “ఇది నెక్స్ట్ స్టెప్ వెడ్డింగ్ సిగ్నల్ అయి ఉంటుందా?” అంటూ చర్చ మొదలు పెట్టేశారు.



ఇక సమంత మాత్రం ఈ ఫోటోతో పాటు ఒక లాంగ్ నోట్ కూడా పోస్ట్ చేసింది. “స్నేహితులు, కుటుంబ సభ్యులతో  ఉన్నాను. గత ఏడాదిన్నర కాలంలో నా కెరీర్‌లో కొన్ని సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌లు తీసుకోవడం, నా అంతర్దృష్టిని నమ్మడం, ముందుకు సాగుతున్నప్పుడు నేర్చుకోవడం — ఇవన్నీ నాకు ఎంతో విలువైన అనుభవాలు. ఈ రోజు చిన్న చిన్న విజయాలను జరుపుకుంటున్నాను. నాకు లభించిన అవకాశాలకు, నాతో పనిచేసిన అత్యంత తెలివైన, కష్టపడి పనిచేసే మరియు నిజాయితీ గల వ్యక్తులందరికీ నేను కృతజ్ఞతతో ఉన్నాను. చాలా నమ్మకంతో చెబుతున్నాను — ఇది కేవలం ఆరంభం మాత్రమే,” అని సమంత పేర్కొంది.



ఇక ఈ పోస్ట్‌పై సమంత అభిమానులు ఫిదా అయిపోతే, కొంతమంది మాత్రం దానికి కౌంటర్‌గా ఫన్నీ రీల్స్, మీమ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాలోని బాలయ్య డైలాగ్, “నవ్వే వాళ్లు నవ్వనీ… ఏడ్చే వాళ్లు ఏడ్వనీ… డోంట్ కేర్!” అన్న లైన్‌ని సింక్ చేసి రీల్స్ వేస్తున్నారు. అంటే, సమంత ఇప్పుడు తన మనసుకు నచ్చినట్టు, ఎవరు ఏమనుకుంటారనే ఆలోచన లేకుండా జీవిస్తోంది అనే సెంటిమెంట్‌ను ఫ్యాన్స్ అర్థం చేసుకుంటున్నారు.ఫ్యాన్స్ కమ్యూనిటీ మొత్తం ఈ పోస్ట్ చుట్టూ హంగామా చేస్తుండగా, సోషల్ మీడియాలో “సమంత ఫుల్ హ్యాపీ మోడ్‌లో ఉంది”, “రాజ్‌తో కెమిస్ట్రీ ఫైర్ లెవెల్‌లో ఉంది”, “ఈసారి సమంత లైఫ్‌లో న్యూ ఛాప్టర్ స్టార్ట్ అయింది” అంటూ కామెంట్స్ వెల్లువలా వస్తున్నాయి. మొత్తం మీద, సమంత పోస్ట్ – రాజ్‌తో ఉన్న ఫోటో – ఫ్యాన్స్ రియాక్షన్స్… ఇవన్నీ కలసి సోషల్ మీడియాలో ఒక చిన్న సంచలనాన్ని సృష్టించేశాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: