టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం
బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస పెట్టి విజయాలను అందుకుంటున్నాడు.
బాలయ్య కొంత కాలం క్రితం డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ
మూవీ ఈ సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయం సాధించింది.
బాలయ్య కొంత కాలం అఖండ అనే సినిమాలో
హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ లో
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా ...
బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ
మూవీ లో
బాలయ్య రెండు పాత్రలలో నటించాడు. ఈ
సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం
బాలయ్య ,
బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ ని ఈ సంవత్సరం
డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా నుండి తాండవం అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాండవం సాంగ్ కి విడుదల 24 గంటల్లో 3.72 మిలియన్ వ్యూస్ ... 76 వేల లైక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే అఖండ 2
మూవీ లోని తాండవం సాంగ్ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ 24 గంటల్లో లభించకపోయిన మంచి రెస్పాన్స్ మాత్రం లభించింది. ఈ
మూవీ కి ఎస్ ఎస్
తమన్ సంగీతం అందిస్తున్నాడు.
తమన్ సంగీతం అందిస్తూ ఉండడంతో ఈ
మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో
బాలయ్య ఏ రేంజ్ బిర్యాని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.