రెబల్ స్టార్
ప్రభాస్ ప్రస్తుతం
రాజా సాబ్ అనే
సినిమా లో
హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిం దే .
మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండ గా ...
నిధి అగర్వాల్ ,
మాళవిక మోహన్ , రీద్ధి
కుమార్ లు ఈ సినిమాలో
ప్రభాస్ కి జోడి గా కనిపించబోతున్నా రు . ఈ సినిమాను వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను మేకర్స్ విడుదల చేశారు. వాటిలో కొన్ని ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. దానితో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి. తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఓ ఏరియా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ విషయాన్ని ఈ
మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించింది.
అసలు విషయం లోకి వెళితే ... తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన నార్త్
అమెరికా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయినట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే నార్త్ అమెరికాలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లు
జనవరి 8 వ తేదీ నుండి ప్రదర్శించనున్నట్లు కూడా ఈ
మూవీ బృందం వారు ఓ
పోస్టర్ ద్వారా తెలియజేశారు. మరి నార్త్ అమెరికాలో ఈ
సినిమా టికెట్ బుకింగ్స్ కు ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది అనేది చూడాలి. ఈ
మూవీ విడుదలకు ఇంకా చాలా రోజులు మిగిలి ఉంది. దానితో ఈ
మూవీ టికెట్ బుకింగ్ కి నార్త్ అమెరికాలో మంచి రెస్పాన్స్ లభిస్తుంది అని చాలా మంది భావిస్తున్నారు.