ఎనర్జిటిక్ స్టార్
రామ్ పోతినేని తాజాగా ఆంధ్ర
కింగ్ తాలూకా అనే సినిమాలో
హీరో గా నటించాడు. ఈ సినిమాలో భాగ్య
శ్రీ బోర్స్ హీరోయిన్గా నటించగా ... మహేష్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఉపేంద్ర ఈ
మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ
మూవీ ని
నవంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల
థియేటర్ హక్కులను ఈ
మూవీ నిర్మాతలు అమ్మి వేశారు. మరి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ
మూవీ ఎన్ని కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగబోతోంది అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ
మూవీ కి నైజాం ఏరియాలో 9 కోట్ల ప్రీ బిజినెస్ జరగగా , సీడెడ్ లో 3 కోట్లు , ఆంధ్ర లో 10 కోట్ల ప్రీ రియలిస్ బిజినెస్ జరిగింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ
మూవీ కి 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని ఈ
మూవీ కి 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవర్సీస్ లో 3.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 27.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ
మూవీ 28 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 28 కోట్ల షేర్ కలెక్షన్లు గనుక వచ్చినట్లయితే ఈ
మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది. మరి ఈ
సినిమా ఏ రేంజ్ టాక్ ను తెచ్చుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.