మాస్ మహారాజా
రవితేజ ఈ మధ్య కాలంలో చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ
మూవీ తో కూడా
రవితేజ కు మంచి విజయం దక్కలేదు. ఆఖరిగా
రవితేజ కు ధమాకా అనే సినిమాతో విజయం దక్కింది. ఈ
సినిమా తర్వాత
రవితేజ కు విజయం దక్కలేదు. తాజాగా
రవితేజ "మాస్ జాతర" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం
రవితేజ ,
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న
భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం వారు ప్రకటించారు. ఈ సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
రవితేజ ఈ
సినిమా తర్వాత
శివ నిర్వాన దర్శకత్వంలో
సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం
రవితేజ సినిమా కోసం
శివ నిర్వాన ప్రీ ప్రొడక్షన్ పనులను ఫుల్ వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాలో
హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే
రవితేజ హీరో గా రూపొందబోయే సినిమాలో ప్రియ భవాని
శంకర్ ను హీరోయిన్గా తీసుకోబోతున్నట్లు , ఇప్పటికే ఈ ముద్దు గుమ్మను కలిసి ఈ
సినిమా కథను
శివ వినిపించినట్లు , ఆమెకు కూడా ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే
రవితేజ ,
శివ కాంబో లో రూపొందబోయే సినిమాలో
హీరోయిన్ గా నటించడానికి ఈ
బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే
శివ నిర్వాన ఆఖరుగా
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన
ఖుషి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యింది.