పుష్ప తరువాత బన్నీ ఇన్ని కధలు విన్నాడా..? ఇండస్ట్రీ చరిత్రలోనే ఇది ఓ రికార్డ్..!

Thota Jaya Madhuri
టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ప్రేక్షకుల్ని తన నటనతో, తన ప్రత్యేకమైన స్టైల్‌తో మరియు వినూత్నమైన పాత్రలతో ఆకట్టుకొని, తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్‌ హీరోగా అత్యంత స్థిరమైన స్థానం సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ప్రారంభం నుండి ప్రయోగాత్మక కథలు చేస్తూ, కొత్త లుక్స్, తాజాదనంతో కూడిన డ్యాన్స్ నంబర్లు… ఇవన్నీ ఆయనను దక్షిణాదిలోనే కాదు, మొత్తం భారతీయ సినీ ప్రేక్షకులకు దగ్గర చేశాయి.ఇలా సౌత్ ఇండస్ట్రీలో భారీ అభిమాన గణాన్ని సంపాదించిన అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాతో తన కెరీర్‌ను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లారు. ‘పుష్ప’ సినిమా ముందు కూడా ఆయనకు మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, ఈ సినిమా ఆయనను పాన్‌–ఇండియా స్టార్‌గా మార్చిన మైలురాయిగా నిలిచింది.



‘పుష్ప: ది రైజ్’ దేశవ్యాప్తంగా ఎలాంటి ఆదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళం, కన్నడ, మలయాళం, హిందీ… ఏ భాషలో రిలీజ్ అయినా ప్రేక్షకులు సినిమాలోని పాత్రలలో గల మూలతత్వాన్ని కనెక్ట్ చేసుకున్నారు. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ చూపించిన నటన, స్టైల్, డైలాగ్ డెలివరీ, ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకున్నాయి.ఈ విజయాన్ని మరింత భారీ స్థాయికి తీసుకెళ్లింది సీక్వెల్ అయిన ‘పుష్ప 2: ది రూల్’. విడుదలైన వెంటనే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలు చెరిపి వేసి 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సునామీ సృష్టించింది. ఇండియా మాత్రమే కాదు, అనేక విదేశీ మార్కెట్లలో కూడా ఈ సినిమా అద్భుతమైన రికార్డులు సృష్టించింది. ఈ భారీ విజయంతో అల్లు అర్జున్ పేరు పాన్ ఇండియా రేంజ్‌లో మారుమోగిపోయింది.



ఇలాంటి దశలో, అల్లు అర్జున్‌తో సినిమా చేయాలనే ఆసక్తి దర్శకుల్లో ఊహించలేనంత పెరిగిపోయింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్‌ను సంప్రదించిన దర్శకుల జాబితా చాలానే పెద్దదిగా ఉందని పరిశ్రమలో టాక్.ఈ జాబితాలో అధికారికంగా బయటకు వచ్చిన పేర్లు మాత్రమే చూసినా అగ్రస్థాయి దర్శకులే కనిపిస్తారు. వాటిలో—

*బాలీవుడ్ లెజెండరీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ

*కన్నడ ఇండస్ట్రీ నుండి మ్యాస్ మాస్టర్ ప్రశాంత్ నీల్

*తమిళ సినిమా ప్రపంచంలో సెన్సేషన్ లోకేష్ కనగరాజ్

*మలయాళ చిత్ర పరిశ్రమలో క్రియేటివ్ ఫిల్మ్‌మేకర్ బాసిల్ జోసెఫ్

*టాలీవుడ్ వైపు చూస్తే కూడా వరుసగా టాప్ డైరెక్టర్ల పేర్లే వినిపిస్తున్నాయి—

*సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా

*మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్

*స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి

*మాస్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను

వీళ్లే  కాకుండా ఇండస్ట్రీలో గుసగుసలుగా వినిపిస్తున్నదేమిటంటే… అధికారికంగా బయటకు రాని మరెంతో మంది దర్శకులు కూడా అల్లు అర్జున్‌కు కథలు వినిపించారని, ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారని. ఇలా ఒకేసారి ఇంతమంది అగ్రస్థాయి దర్శకులు ఒక స్టార్‌ హీరో కోసం లైన్‌లో నిలబడటం అనేది తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు చాలా అరుదుగా జరిగిందని అభిమానులు గర్వంగా చెబుతున్నారు.  నటనలో, మార్కెట్లో, పాన్ ఇండియా రేంజ్‌లో ఈ స్థాయి రికార్డులను టచ్ చేయడం చాలా మందికి సాధ్యం కాదు. కానీ అల్లు అర్జున్ మాత్రం తన కృషి, స్టైల్, పాత్రల ఎంపికతో ఈ శిఖరాలను అధిరోహించగలిగారు.అందుకే ఆయన కోసం ఇండస్ట్రీలో ఈ లెక్కెవరూ టచ్ చేయలేని రికార్డ్‌గా నిలిచిందని అభిమానులు గర్వంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: