అఖండ-2 వాయిదా..పవన్ కళ్యాణ్ లా బాలకృష్ణ నిర్మాతల పక్షాన ఎందుకు నిలబడలేదు.?

Pandrala Sravanthi
బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ-2 మూవీ మీద ఎంతోమందికి ఎన్నో అంచనాలు ఉన్నాయి.భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా చివరికి సినిమా రిలీజ్ ని వాయిదా వేశారు. ప్రీమియర్స్ రద్దవడంతో టెక్నికల్ ఇష్యూ వల్లే అది జరిగిందని చాలామంది అభిమానులు తమకు తాము సర్ది చెప్పుకున్నారు.కానీ ఫైనల్ గా సినిమానే వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించడంతో బాలకృష్ణ అభిమానుల్లో కోపం నశాలానికి ఎక్కింది. చాలామంది హడావిడి చేశారు.మీడియా ముఖంగా నిర్మాతలను ఏకీపారేసారు.ఇదంతా పక్కన పెడితే నిర్మాతల విషయంలో పవన్ కళ్యాణ్ లా బాలకృష్ణ ఎందుకు ఆలోచించ లేకపోయారు..ఎందుకు రంగంలోకి దిగలేకపోయారు అంటూ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. 


ఇక అసలు విషయం ఏమిటంటే.. గతంలో హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడబోతుందని పవన్ కళ్యాణ్ కి సంకేతాలు వెళ్లిన సమయంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి తన నుండి నెక్స్ట్ రాబోయే సినిమాల విషయంలో హామీలు ఇవ్వడంతో హరిహర వీరమళ్లు సినిమా విడుదల చేశారు. ఒకవేళ ఈ సినిమా విడుదల ఆగిపోతే మాత్రం నిర్మాతలు భారీ నష్టాలు చూసేవారు.ఎందుకంటే అప్పటికే హరిహర వీరమల్లు సినిమా విషయంలో ఎన్నో కోట్లు నష్టపోయారు నిర్మాతలు. ఇంకా సినిమా వాయిదా పడితే నిర్మాతలు రోడ్డున పడతారని పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఇష్యూస్ అన్నీ క్లియర్ చేశారు. 
అలాగే సినిమా కోసం ప్రచారం కూడా చేశారు.


కానీ పవన్ కళ్యాణ్ లా నిర్మాతల పక్షాన బాలకృష్ణ ఎందుకు నిలబడలేకపోయారు అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. సినిమా విడుదల వాయిదా పడబోతుందని తెలియగానే బాలకృష్ణ రంగంలోకి దిగి నిర్మాతల ఇష్యూ క్లియర్ చేస్తే ఇప్పుడు సినిమా విడుదలయ్యేది కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. బాలకృష్ణ కూడా నిర్మాతల కోసం రంగంలోకి దిగారట. కానీ నిర్మాణ సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయని తెలియడంతో ఆయన కూడా సైలెంట్ అయిపోయారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఓ బిగ్ ప్రాజెక్టు చివరి వరకు వచ్చి వాయిదా పడడం అభిమానులకి తీవ్ర ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: