అఖండ 2 వాయిదా: బాలయ్య ఫ్యాన్స్ సెన్సేషనల్ డెసీషన్.. ఇది నిజమైన అభిమానం అంటే..!
కొంతమంది ట్రోలర్స్ మాత్రం బాలయ్యను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఘాటుగా రియాక్ట్ అయ్యారు. “ఇంత సీనియర్ స్టార్ అయిన బాలయ్య సినిమా కూడా ఇలా ఆగిపోవడం ఏంటి?”, “ఇంత ప్రభావం ఉన్న వ్యక్తి సినిమా రిలీజ్‌కి కూడా అడ్డంకులు తొలగించుకోలేకపోయాడా?” అంటూ విమర్శలు గుప్పించారు.అయితే, మరో వైపు నిజమైన అభిమానం ఎలా ఉంటుందో బాలయ్య అభిమానులు చూపించారు. చిన్న నెగిటివ్ కామెంట్లకు కుప్ప పడకుండా, ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించకుండా వారు ఇచ్చిన స్పందన అందరిని ఆశ్చర్యపరిచింది.
బాలయ్య ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే—“సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందో, ఎలా రిలీజ్ అయిందో అనే విషయం కాదు. బాలయ్య సినిమా అంటే అదిరిపోయే రికార్డులు గ్యారంటీ. వాయిదా పడినా మా ధైర్యం తగ్గదు. బాలయ్య గారికి మేము ఎప్పుడూ సపోర్ట్‌గానే ఉంటాం.”అంటూ సోషల్ మీడియాలో ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో ట్రెండ్ చేస్తున్నారు.ట్రోల్స్ చేసే వారిని కూడా ఘాటుగా కౌంటర్ చేస్తున్నారు.
“సినిమా హిట్ అవుతుందా అనేది తరువాత విషయం. కానీ రిలీజ్ వాయిదా పడ్డా కూడా అభిమానులు ఇలా బలం చాటడం… ఇదే నిజమైన నందమూరి అభిమానం.”అనే కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.సినిమా వాయిదా వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనే అంశంపై ఇంకా అధికారికంగా పూర్తి క్లారిటీ రాలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఏ కారణం వచ్చినా, ఎంత ఆలస్యం జరిగినా ‘అఖండ 2’ బాలయ్య కెరీర్లో గొప్ప మైలురాయి అవుతుందని 100% నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.అభిమానుల ధైర్యం, విశ్వాసం, ప్రేమ… బాలయ్య స్టార్ స్టామినా ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించింది. నిజమైన అర్థంలో “అభిమానం” అంటే ఇదే అని నెట్టింట మొత్తం ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.