41 ఏళ్ల వయసులో 20 ఏళ్ల గ్లో..! అభిమానులను ఆశ్చర్యపరిచిన లేడీ సూపర్‌స్టార్ బ్యూటీ ఫార్ములా!
‘లోకల్ ఫుడ్’ అంటే లోకల్ పవర్!
నయనతార తరగని అందం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని.. ఆమె తన స్కిన్‌కేర్ బ్రాండ్ ప్రమోషన్లలో భాగంగా బోల్డ్‌గా రివీల్ చేసింది.దేశీ ఫార్ములా: "నేను చిన్నప్పటి నుంచి తిన్న, నా శరీరానికి అలవాటు పడిన స్థానిక ఆహారమే నా అందానికి పునాది. ఖరీదైన విదేశీ ఆహారం కోసం పరుగులు పెట్టకుండా, మీ ప్రాంతానికి చెందిన ఆహారం తినడం, సీజన్‌లో దొరికే పదార్థాలు వాడటమే నిజమైన ఆరోగ్యం, అందం." అని ఆమె గట్టిగా చెప్పింది.
మన సౌత్ ఇండియా వంటకాలే బలం: ఆమె డైట్‌లో ప్రత్యేకంగా స్థానం సంపాదించుకున్నవి.. మన సాధారణ పప్పు, సాంబార్, రసం, పెరుగు లాంటివేనట! అలాగే, కొబ్బరి, కరివేపాకులు, నువ్వుల నూనె, మజ్జిగ, అరటిపండ్లు, సిరిధాన్యాలు వంటి సౌత్ ఇండియన్ ఫుడ్‌లోని పోషకాలే తనకు సహజ శక్తిని, మెరిసే చర్మాన్ని ఇస్తున్నాయని నయన్ నమ్ముతుంది.నో షుగర్.. నో జంక్: నయనతార చక్కెరను దాదాపుగా తన డైట్ నుంచి తీసేసింది. అలాగే జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉంటుంది. కేలరీలు లెక్కపెట్టుకోవడం కంటే.. పోషక విలువలున్న ఇంటి ఆహారం తీసుకోవడానికే ఆమె ప్రాధాన్యత ఇస్తుంది.
వర్కౌట్, యోగా.. మెంటల్ బ్యాలెన్స్!
కేవలం ఆహారం మాత్రమే కాదు, తన డిసిప్లిన్డ్ లైఫ్‌స్టైల్ కూడా ఈ గ్లో వెనుక ఉందంటుంది నయన్:
ప్రతిరోజూ వర్కౌట్: షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా, ప్రతిరోజూ ఒకటిన్నర గంట పాటు స్ట్రెంగ్త్ ట్రైనింగ్, పిలాటెస్, కార్డియో వర్కౌట్స్ మిస్ చేయదు.
యోగాతో శాంతి: బాడీ ఫ్లెక్సిబిలిటీ, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఆమె యోగాను తప్పనిసరిగా ఫాలో అవుతుంది. ఫిట్‌నెస్ అంటే శరీరం మాత్రమే కాదు, మనసు కూడా అంటుంది.
సరైన నిద్ర: ఎంత ముఖ్యమైన షెడ్యూల్ ఉన్నా.. సరైన నిద్ర విషయంలో ఆమె ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వదు.
ఇవే, 41 ఏళ్ల వయసులో కూడా నయనతార గ్లామర్ రాణిగా వెలిగిపోవడానికి అసలు కారణాలు!