అఖండ2 విషయంలో మహేష్ ను నిందించొద్దు.. అసలు వివాదం ఇదే!

Reddy P Rajasekhar

బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం అఖండ 2. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడటంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది అభిమానులు ఈ వాయిదాకు కారణం మహేష్ బాబు అని కామెంట్లు చేయడం, పోస్టులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ విషయంలో మహేష్ బాబును నిందించడం సరికాదని, అసలు వివాదం వేరే ఉందని తెలుస్తోంది.

అఖండ 2 సినిమా వాయిదా పడటానికి కారణం ఒక పాత ఆర్థిక వివాదమని సమాచారం. పరిశ్రమ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు, 14 రీల్స్ బ్యానర్ 2019 జూలై 23వ తేదీన యురోస్ (Eros) సంస్థ నుంచి రూ. 27 కోట్లు రుణంగా తీసుకున్నారు. ఈ రుణానికి వడ్డీ 14 శాతం కాగా, వడ్డీతో సహా మొత్తం బకాయి ఇప్పుడు రూ. 51 కోట్లకు చేరిందని తెలుస్తోంది.

ఈ మొత్తం వ్యవహారంలో, యురోస్ సంస్థ కోర్టులో 50 శాతం మొత్తాన్ని చెల్లించి, మిగిలిన మొత్తానికి చెక్కుల రూపంలో నిర్దిష్ట తేదీలు వేసి ఇవ్వాలని కోరుతున్నట్లు భోగట్టా. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదంపై ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నాయని సమాచారం.

అందుకే, అఖండ 2 విడుదల వాయిదాకు మహేష్ బాబుకు ఎలాంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా ఆర్థిక వివాదానికి సంబంధించిన సమస్య అని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి, సినిమా త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా క్రిస్మస్ పండుగ కానుకగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అఖండ 2 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని బాలకృష్ణ అభిమానులు ఆశిస్తున్నారు. అఖండ2 మూవీ గురించి త్వరలో అధికారికంగా పూర్తిస్థాయిలో అప్ డేట్స్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: