బాలయ్యకి ఉన్న ఆ క్వాలిటీనే బిగ్ మైనస్‌గా మారబోతుందా..? అఖండ 2 నేర్పిన గుణపాఠం ఇదే..!
ఇప్పటి వరకూ బాలయ్య కెరీర్‌లో ఏ సినిమా విషయంలోనూ ఇలా జరగలేదు. వంద సినిమాల కెరీర్ ఉన్న హీరోకి, అదీ చివరి గంటలో ప్రీమియర్స్ నిలిపివేయడం చాలా పెద్ద ప్రతిష్ట సమస్యే అని అభిమానులు పేర్కొంటున్నారు. ఇదంతా ఎందుకు జరిగిందనే విషయంపై ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఇది పూర్తిగా పేమెంట్స్ క్లియర్ కాకపోవడం వల్లనే జరిగిందని అంటుంటే, మరికొందరు ఇది లోపలి వర్గాల్లోని అసమంజసాలు, పొరపాట్ల వల్ల జరిగిందని అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంతో సోషల్ మీడియాలో ఒక పెద్ద డిస్కషన్ మొదలైంది—“బాలయ్యకి ఉన్న మంచితనం, నమ్మకం అనే క్వాలిటీనే ఆయనకు ఇప్పుడు పెద్ద మైనస్‌గా మారుతోందా?” అన్న ప్రశ్న.
బాలయ్య తన చుట్టూ ఉన్నవారిని చాలా బాగా నమ్మేస్తారు. సరైన పర్యవేక్షణ లేకుండా, పూర్తిగా వారి మాట నమ్ముకుని బాధ్యతలను అప్పగించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అనేక మంది విశ్లేషిస్తున్నారు. మంచి మనసుతో, నమ్మకంతో వ్యవహరించే ఆయన స్వభావాన్నే కొందరు తప్పుగా ఉపయోగించుకుంటున్నారని, అది చివరికి ‘అఖండ 2’ లాంటి భారీ ప్రాజెక్ట్‌పై ప్రభావం చూపిందని అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.‘అఖండ 2’ బాలయ్య కెరీర్‌లో మళ్లీ ఒక కొత్త మైలురాయిగా నిలుస్తుందని, బోయపాటి-బాలయ్య కాంబినేషన్ అంటే హిట్ గ్యారంటీ అని అందరూ నమ్మారు. కానీ ఇలా చివరి నిమిషంలో సినిమా రిలీజ్ క్యాన్సిల్ కావడం అభిమానులను తీవ్రంగా డిసప్పాయింట్ చేసింది.
ఈ ఘటనతో అభిమానులు చెబుతున్న గుణపాఠం ఒక్కటే—“మనసు మంచిదిగా ఉండొచ్చు, కానీ చుట్టూ ఉన్న వాళ్లను ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అన్నది హీరోగా, నాయకుడిగా, పెద్ద మనిషిగా గుర్తించాలి. లేకపోతే మన మంచితనాన్నే కొందరు ఆయుధంగా మార్చుకుంటారు.”బాలయ్య అభిమానులు ఇప్పుడు స్పష్టంగా చెప్పుకుంటున్నది ఏమిటంటే,ఇకనైనా బాలయ్య తనను నమ్మించి మోసం చేసే, బాధ్యతలు సరిగా నిర్వర్తించని వారిని దూరం పెట్టాలి.