మొత్తం చేసింది చిరంజీవి,దిల్ రాజ్ లే.. అఖండ -2 వాయిదా వేళ వైరల్ అవుతున్న వీడియో.!

Pandrala Sravanthi
 ఏంటి అఖండ -2 వాయిదా పడడానికి కారణం ఫైనాన్షియల్ ఇష్యూస్ కాదా.. దిల్ రాజు,చిరంజీవిల వల్లే సినిమా ఆగిపోయిందా..వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం.బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.సినిమా అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ చూసి రివ్యూ ఇచ్చేశారు. కానీ సడన్గా ప్రీమియర్స్ ఆగిపోయాయి. దాంతో అప్పటికే ప్రీమియర్స్ చూడడానికి ఎంతో ఆశగా ఉన్న అభిమానులకు నిరాశ మిగిలింది.  కనీసం 5వ తేదినైనా సినిమా విడుదలవుతుందని ఎన్నో కలలు కన్నారు. కానీ చివరికి సినిమా పూర్తిగా వాయిదా పడింది. 


14 రీల్స్ సంస్థ గతంలో విడుదలైన ఆగడు, 1 నేనొక్కడినే సినిమాల లావాదేవీలను క్లియర్ చేయకపోవడం వల్ల ఈరోస్ సంస్థ అఖండ -2  విడుదల కాకుండా చేశారని ప్రచారం జరిగింది.కానీ అసలు విషయం ఇది కాదని, అంత పెద్ద హీరో సినిమా విడుదల అవుతుంది అంటే వాళ్ళు ఆపడం ఏంటి.. అదంతా ఏమీ కాదు. కేవలం దిల్ రాజు, చిరంజీవిల పేర్లు బయటపడకుండా ఈ ప్రచారం తెరమీదకి వచ్చింది. అఖండ -2 సినిమా వాయిదా పడడానికి కారణం చిరంజీవి,దిల్ రాజులే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ అభిమానులు. 


సినిమా వాయిదా పడటంతో నిరాశలో ఉన్న అభిమానులను కొంతమంది మీడియా వాళ్ళు ప్రశ్నించగా..ఇదంతా దిల్ రాజు, చిరంజీవిలు కలిసి చేసిన పని అని, వారి వల్లే అఖండ -2 ఆగిపోయిందని, సినిమా ఆగిపోవడానికి మెయిన్ కారణం వారే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బాలకృష్ణ అభిమానులు దిల్ రాజు,చిరంజీవి పేరు ప్రస్తావిస్తూ మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.అయితే ఈ వీడియో పై ఇప్పటివరకు దిల్ రాజు గానీ, చిరంజీవి గానీ స్పందించలేదు. అయితే రీసెంట్ గా చిరంజీవి గురించి బాలకృష్ణ అసెంబ్లీలో కాస్త వెటకారంగా మాట్లాడారు. ఆ కోపంతోనే ఇలా చేశారు అన్నట్లు బాలకృష్ణ అభిమానులు పరోక్ష కామెంట్లు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: