అఖండ 2: సినిమా కోసం అలాంటి పని చేసిన బాలయ్య -బోయపాటి..!
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా వాయిదా పడడంతో హీరో నందమూరి బాలకృష్ణ ముందుకు వచ్చిన నిర్మాతలు సైతం అండగా నిలబడినట్లు తెలుస్తోంది. రెమ్యూనరేషన్ విషయంలో బాలయ్యకు నిర్మాతలు ఇంకా రూ .7 కోట్ల రూపాయల వరకు పెండింగ్ పెట్టారు. అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు కూడా రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంది. నిర్మాతల ఇబ్బందులను గుర్తించిన బాలయ్య, బోయపాటి ఇద్దరు కూడా నిర్మాతలకు సహాయంగా తన రెమ్యూనరేషన్ ని వదులుకున్నట్లు సమాచారం.
వీటికి తోడు ప్రముఖ నిర్మాతగా పేరు సంపాదించిన దిల్ రాజు కూడా కొంతమేరకు హామీ ఇచ్చినట్లుగా వినిపిస్తోంది. ఇప్పుడు ఫైనాన్స్ ఇష్యూ కూడా క్లియర్ అవ్వడంతో 14 రీల్స్ ప్లస్ మేకర్స్ ఈరోజు మద్రాస్ హైకోర్టుకు అప్పిల్ కు వెళ్లినట్లుగా వినిపిస్తుంది. అఖండ 2 సినిమా రిలీజ్ కి తమకు అనుమతి ఇవ్వాలంటూ కోరబోతున్నట్లు తెలుస్తోంది. మరి తీర్పు ఎలా వస్తుందో అనే విషయంపై అభిమానులు చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ అన్ని అనుకూలిస్తే ఈరోజు రాత్రి ప్రీమియర్ షోలు వేసి రేపటి రోజున సినిమాని విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.