అఖండ 2 వివాదంపై 14 రీల్స్ ప్లస్ సంచలన స్పందన..ఒక్క దెబ్బతో దొంగలు ఎవరో చెప్పేశారుగా..!?

Thota Jaya Madhuri
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘అఖండ 2’ సినిమా విడుదల ఆకస్మికంగా వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొన్న ఈ సమయంలో ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 14 రీల్స్ ప్లస్ తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఒక సంచలన ట్వీట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా వాయిదా వెనుక ఉన్న కారణాలపై వారు చేసిన వివరణ, బాలయ్య–బోయపాటి శ్రీను పై వ్యక్తం చేసిన కృతజ్ఞతలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.


అఖండ 2 విడుదల వాయిదా పడటం పట్ల తాము కూడా అభిమానుల మాదిరిగానే తీవ్రంగా బాధపడుతున్నామని 14 రీల్స్ ప్లస్ పేర్కొంది. వారి ప్రకటన ప్రకారం — కొన్ని అనుకోని వివాదాలు, కొన్ని సాంకేతిక సమస్యలు, ప్రాసెస్‌లో తలెత్తిన అపరిచిత అడ్డంకులు వల్ల సినిమా సమయానికి విడుదల చేయడం సాధ్యపడలేదని వివరించింది. “కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు అనివార్యం అవుతాయి. ప్రాజెక్ట్‌కు నష్టం కలగకుండా, అందరికీ ఉత్తమమైన అనుభవం ఇవ్వడానికి కొద్దిపాటి ఓపిక ఎంతో అవసరం” అని స్పష్టం చేసింది.

 

14 రీల్స్ ప్లస్ మరింత భావోద్వేగంగా మారుతూ బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుపై తమ అభిమానాన్ని వ్యక్తం చేసింది. “ఈ ప్రాజెక్ట్‌లో మేము ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నా, బాలయ్య గారు ఉన్నారనే నమ్మకం మా పెద్ద బలం”
“బోయపాటి శ్రీను గారి నమ్మకం, మాకు ఇచ్చిన ప్రోత్సాహం మాటల్లో చెప్పలేం”..“వారిద్దరి రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము” అని పేర్కొంది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా పబ్లిక్‌గా భావోద్వేగం వ్యక్తం చేయని 14 రీల్స్ ప్లస్ ఈసారి ప్రత్యేకంగా స్పందించడం ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది.




రిలీజ్ వాయిదాతో తీవ్ర నిరాశ చెందిన అభిమానులకు 14 రీల్స్ ప్లస్ క్షమాపణలు కూడా చెప్పింది. “మీ ఉత్సాహం, మీ ప్రేమ మాకు తెలుసు. కానీ మీ అంచనాలను మించి ఉండే విధంగా చిత్రాన్ని తీసుకురావాలంటే కొంత సమయం అవసరం” అని పేర్కొంది. అంతేకాక… అఖండ 2 ను అతి త్వరలోనే రిలీజ్ చేస్తామని, కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని, అభిమానులు ఇంకొద్దిసేపు సహనంగా ఉండాలని వారు కోరారు. సాధారణంగా ఏ సినిమా రిలీజ్ డిలే అయినా ప్రొడక్షన్ హౌసులు సాదారణ ప్రకటన మాత్రమే విడుదల చేస్తాయి. కానీ ఈసారి 14 రీల్స్ ప్లస్ చేసిన ఎమోషనల్, డీటైల్డ్, పర్సనల్ మెసేజ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫాం ఇలా పబ్లిక్‌గా బాధను వ్యక్తం చేయటం, క్షమాపణలు చెప్పటం, కృతజ్ఞతలు తెలియజేయటం చాలా అరుదైన విషయం.


అఖండ 2 వాయిదా అభిమానులకు పెద్ద నిరాశే అయినా, 14 రీల్స్ ప్లస్ ఇచ్చిన హామీతో ఇప్పుడు అందరూ సినిమా కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య–బోయపాటి కాంబినేషన్‌పై ఉన్న నమ్మకం కారణంగా అఖండ 2 విడుదల ఎప్పుడైనా, అది రివర్స్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ ఒక్క ట్వీట్ తో ఉన్న కాట్రవర్సీ..అసలు దీని వెనుక ఉన్న దొంగలు ఎవరు అనేది ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది 14 రీల్స్ సంస్ధ అంటున్నారు ఫ్యాన్స్..!



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: