ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూప‌ర్ హిట్ సినిమా సుస్వాగ‌తంకు టీడీపీ ఎమ్మెల్యేకు లింక్ ఉందా..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతోమంది అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన స్టార్. నటుడిగా, తర్వాత రాజకీయ నాయకుడిగా తనదైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయన కెరీర్ ప్రారంభ దశలో వచ్చిన అనేక సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. వాటిలో సుస్వాగతం ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అయితే ఈ సినిమాకు టీడీపీ ఎమ్మెల్యేకు ఓ లింక్ ఉంద‌ట‌. చిలకలూరిపేట ఎమ్మెల్యే , మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలని ఆయన అప్పుడే భావించిన సంగతి తాజాగా వెలుగులోకి వచ్చింది.
చిలకలూరిపేటలో నిర్వహించిన మెగా టీచర్ పేరెంట్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదే వేదికపై ప్రత్తిపాటి పుల్లారావు ప్రసంగిస్తూ 26 ఏళ్ల క్రితం జరిగిన ఆసక్తికర విషయాన్ని గుర్తుచేశారు.


“1998లో సుస్వాగతం ప్రివ్యూ షో చూశాను. అప్పటికి నేను రాజకీయాల్లోకి రాలేదు. పవన్ కళ్యాణ్‌కు నేను ఎంతో పెద్ద అభిమానిని. ఆ షోను భీమినేని శ్రీనివాసరావు, పవన్ కళ్యాణ్, నేను ముగ్గురం కలిసి చూశాం. సినిమా పూర్తయ్యాక పవన్‌తో నేను సినిమా తీస్తే ఎలా ఉంటుందని అనిపించింది. అడగగానే ఆయన వెంటనే అంగీకరించారు” అని పుల్లారావు నాటి సంగ‌తులు గుర్తు చేసుకున్నారు. అయితే ఆ తరువాత పరిస్థితులు మారి ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ నిర్ణయం కారణంగా సినిమా నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. “లేకపోతే పవన్ గారితో సినిమా తీసి ఖచ్చితంగా ఒక సంచలనం సృష్టించేవాడిని” అని పుల్లారావు తెలిపారు. ఇక ఈ సినిమా ద‌ర్శ‌కుడు భీమినేని శ్రీనివాస‌రావుది ప‌క్క‌నే ఉన్న బేత‌పూడి అని పుల్లారావు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు చెప్ప‌గా ప‌వ‌న్ ముసిముసి న‌వ్వులు న‌వ్వుకున్నారు. ఇక సుస్వాగ‌తం సినిమా లో త‌మిళ న‌టి దేవ‌యాని హీరోయిన్ గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: