అఖండ 2 కొత్త డేట్... బాలయ్యతో యంగ్ హీరోకు పోటీ తప్పదా..?
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ 2 భారీ హైప్తో రిలీజ్కు ముందు అనూహ్యంగా వాయిదా పడింది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయి థియేట్రికల్ రిలీజ్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగినా, చివరి నిమిషంలో ఏర్పడ్డ సాంకేతిక, ఆర్థిక సమస్యలు కారణంగా సినిమా ఆగిపోయినట్లు పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి. మేకర్స్ పరిస్థితిని సాప్ చేయడానికి ఎంత ప్రయత్నించినా, ప్రీమియర్లను వేయించలేకపోయారు. దీంతో కొత్త రిలీజ్ డేట్పై చర్చలు మొదలయ్యాయి.ఇక ఇప్పుడు సినిమాపై ఉన్న భారీ అంచనాలను దృష్టిలో పెట్టుకుని, అఖండ 2ను ఎలాంటి హడావుడి లేకుండా మరో డేట్లో రిలీజ్ చేయాలని టీం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతండిసెంబర్ 12 మరియు డిసెంబర్ 25 .. ఈ రెండు తేదీల్లో ఏ డేట్ను ఫైనల్ చేస్తారనే ఆసక్తి పెరుగుతోంది.
ఇదిలా ఉండగా, డిసెంబర్ 25న మరో సినిమా ఇప్పటికే రిలీజ్కు స్లాట్ బుక్ చేసుకుంది. యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ శంబాల. ఈ సినిమా టీమ్ ఆ డేట్ కోసం ముందుగానే ప్రమోషన్స్ ప్రారంభించి బరిలో నిలిచింది. ఈ నేపథ్యంలో అఖండ 2 కూడా అదే తేదీని లాక్ చేస్తే, క్లాష్ తప్పదన్న చర్చ మొదలైంది. ఇటీవలి ఇంటరాక్షన్లో ఆది సాయి కుమార్ స్పందిస్తూ, “ డిసెంబర్ 25 మా ప్లాన్ ప్రకారమే ఉంది. మేము వెనక్కి తగ్గే ఆలోచనలో లేము. అయితే పరిశ్రమలో అందరూ కలిసి ముందుకు వెళ్లాలి కాబట్టి ముందుగా పరిస్థితులు ఎలా మారతాయో చూస్తాం ” అని తెలిపారు. దీంతో అఖండ 2 టీమ్ కొత్త రిలీజ్ డేట్ను ప్రకటించే వరకు స్పష్టత రానుంది. ఏదేమైనా తెలుగు సినీ అభిమానులు .. అటు నందమూరి అభిమానులు అందరూ అఖండ 2 థియేటర్ల లో ఎప్పుడు సందడి చేస్తుందా ? అని ఒక్కటే ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.