' వార‌ణాసి ' ఆ రికార్డుల దుమ్ము దులిపేస్తుందా... మోత మోగిపోతుందా..?

RAMAKRISHNA S.S.
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి - టాలీవుడ్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న  ‘వారణాసి’  సినిమా గురించి అధికారికంగా ఏ చిన్న అప్డేట్ వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ప్ర‌తి ఒక్క సినీ అభిమాని ఆస‌క్తితో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌లతో ప్రపంచ సినీ ఇండస్ట్రీకి తనదైన గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి, హాలీవుడ్ రేంజ్‌ విజువల్స్‌తో ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారని ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ హైప్ ఏర్పడింది. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారని సమాచారం. యాక్షన్, ఇంటెన్సిటీ, ఎమోషన్స్ అన్నీ క‌లిసి ఉండే ఈ పాత్ర మహేష్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉన్నట్లు యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రియాంక చోప్రా ముఖ్య పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్పవర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.


ఇంట‌ర్నేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్ లో నటీనటులు, టెక్నీషియన్‌లు ఈ చిత్రంలో భాగమవుతుండటం గ్లోబల్ సినిమా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించి డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులపై ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల మధ్య పోటీ రికార్డు స్థాయిలో సాగుతోందని టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, ‘వారణాసి’కి ఓటీటీ రైట్స్ కోసం రూ.1000 కోట్ల వరకు డీల్ వెళ్లే అవకాశాలు ఉన్నాయని — ఇది భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ డిజిటల్ డీల్‌గా నిలిచే అవకాశం ఉంది. రాజమౌళి బ్రాండ్, మహేష్ బాబు స్టార్ పవర్ కలిసి ఇంత భారీ డీల్‌ తీసుకొచ్చినట్లు పేర్కొంటున్నారు.


ఈ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్ అందిస్తుండగా, అదనపు స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్స్‌ను దేవ కట్టా అందిస్తున్నారు. సంగీతాన్ని ఎం.ఎం. కీరవాణి అందిస్తుండగా, విజువ‌ల్స్‌, వీఎఫ్ఎక్స్‌కు ప్రపంచ స్థాయి టెక్నీషియన్లు పని చేస్తున్నారు. శ్రీదుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ ప్రస్తుతం వేగంగా సాగుతుండగా, ప్రతి అప్‌డేట్ పై అభిమానులు భారీగా రియాక్ట్ అవుతున్నారు. అంచనాలు చూస్తుంటే, ‘వారణాసి’ ఇండియన్ సినిమా హిస్టరీలో కొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేయడం ఖాయం అన్న భావన ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: