హిట్టు కొట్టి ఆరేళ్లు.. అయిన బ్యూటీకి స్టార్ హీరో మూవీలో ఛాన్స్..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి వరుస పెట్టి సినిమాలతో విజయాలు దక్కనట్లయితే స్టార్ హీరోల సినిమాలలో వారికి అవకాశాలు చాలా తక్కువ శాతం దక్కుతూ ఉంటాయి. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఓ బ్యూటీ కి ఆఖరిగా విజయం దక్కి ఆరు సంవత్సరాలు అవుతుంది. 2019 వ సంవత్సరం ఆ బ్యూటీ నటించిన సినిమా విడుదల అయ్యి మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన పలు సినిమాలు విడుదల అయినా కూడా అవి మంచి విజయాలు అందుకోలేదు. ఆ తర్వాత ఆమె అనేక తమిళ , హిందీ సినిమాలలో నటించింది. వాటి ద్వారా ఆమెకు మంచి విజయాలు దక్కాయి.


కానీ తెలుగులో ఆమెకు విజయం దక్కి ఆరు సంవత్సరాలు అయిన కూడా ప్రస్తుతం మాత్రం ఓ టాలీవుడ్ స్టార్ హీరో మూవీ లో అవకాశాన్ని దక్కించుకుంది. ఇంతకు ఆ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ బ్యూటీ అయినటువంటి రాశి కన్నా. ఈమె ఆఖరుగా సాయి ధరమ్ తేజ్ హీరో గా మారుతి దర్శకత్వంలో రూపొందిన ప్రతి రోజు పండగే అనే సినిమాతో తెలుగు బాక్సా ఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది. ఈ మూవీ 2019 వ సంవత్సరం విడుదల అయింది. ఈ మూవీ తర్వాత ఈమె నటించిన చాలా సినిమాలు విడుదల అయ్యాయి.
 


కానీ ఏ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోలేదు. తాజాగా ఈమె తెలుసు కదా అనే తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ కూడా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో ఈమె హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఈమె మళ్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rk

సంబంధిత వార్తలు: